Home Filmy Adda “అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రెగ్నెంట్ అమ్మాయిని మంచానికి కట్టేసి”..సీరియల్ నటి సంచలన కామెంట్స్.!

“అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రెగ్నెంట్ అమ్మాయిని మంచానికి కట్టేసి”..సీరియల్ నటి సంచలన కామెంట్స్.!

by Anudeep

Ads

ప్రేమించకపోతే యాసిడ్ దాడి, పెళ్లిచేస్కుని తగిన కట్నం ఇవ్వలేదని యాసిడ్ దాడి, అత్యాచారం చేసి యాసిడ్ పోసి తగలబెట్టడం ఇలా మహిళలు అడుగడుగునా బలవుతూనే ఉన్నారు. నెలల పసికందు నుండి పండు ముసలి వరకు ఈ అగాయిత్యాలకు బలి అవుతూనే ఉన్నారు.మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడుతూ, తన జీవితంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు నటి జ్యోతిరెడ్డి.

Video Advertisement

సీరియల్ నటి జ్యోతి రెడ్డి

సీరియల్ నటి జ్యోతి రెడ్డి

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన పేరు జ్యోతి రెడ్డి . పెళ్లి చేసుకుందాం, అష్టా చమ్మా, ఈశ్వరి, భార్మామణి సీరియల్స్ లో తన నటన ద్వారా ఆకట్టుకున్న జ్యోతిరెడ్డి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూతో దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసారు.అంతేకాదు తన జీవితంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుని,జీవితాంతం అది తనను వెంటాడుతుందని బాధపెట్టారు.

సీరియల్ నటి జ్యోతి రెడ్డి

జ్యోతిరెడ్డి  చెప్పిన ఆ చేదు అనుభవం తన మాటల్లోనే “ ప్రెగ్నెంట్ లేడిని స్వయంగా తన భర్తే, మంచానికి కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై యాసిడ్ పోస్తే, అక్కడిక్కడ మంచంతో సహా కాలిపోయింది.స్వయంగా కళ్లారా చూసాను నేను..అలాంటి ఘటనలు అడుగడుక్కి జరుగుతున్నాయి. మనుషులలో మానవత్వం చనిపోయి,కౄరత్వం పెరిగిపోయింది.” అంటూ చెప్పుకొచ్చారు.

సీరియల్ నటి జ్యోతి రెడ్డి

సినిమాల్లో , సీరియళ్లలో చూపించేవి బయట ప్రజలు ఫాలో అవతున్నారనే ఒక విమర్శ వినిపిస్తుంటుంది..దానిపై కూడా జ్యోతిరెడ్డి స్పందించారు. “సినిమాల్లో మరియు బుల్లితెరలో చూపించేది ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయని అంతేగాని ఇలా చేయాలని ఉద్దేశపూర్వకంగా ఎవరూ చూపించరని కాబట్టి మనుషుల్లో మార్పు వచ్చేంత వరకు ఇలాంటి ఆగడాలు ఆగవు”అని అన్నారు.


End of Article

You may also like