సినిమా ప్రేమికులకు చేదు వార్త…లాక్ డౌన్ ఎత్తేసినా అన్ని నెలలు వరకు..!

సినిమా ప్రేమికులకు చేదు వార్త…లాక్ డౌన్ ఎత్తేసినా అన్ని నెలలు వరకు..!

by Anudeep

Ads

శుక్రవారం వచ్చిందంటే చాలూ ఏ సినిమా రిలీజవుతుందా? ఏ థియేటర్లో వాలిపోదామా అని చూస్తుంటారు సిని ప్రేమికులు.. కాని లాక్ డౌన్ పుణ్యమాని థియేటర్లు ఎక్కడిక్కడ క్లోజ్ అయిపోయాయి.  పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో సినిమా హాళ్లు తెరుచుకునేలా  కనిపించట్లేదు..థియేటర్లు తెరుచుకోవడానికి సుమారు ఆర్నెళ్లు పడుతుందని సమాచారం..

Video Advertisement

పండగల తర్వాత సినిమాలు రిలీజవ్వడానికి అనువైన సమయం ఏదైనా ఉందా అంటే అది సమ్మర్ మాత్రమే.. ఎందుకంటే అప్పటికి ఎగ్జామ్స్ అయిపోయి అందరూ హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంటారు. మన దేశంలో క్రికెట్ తో పాటు , సినిమా ఒక్కటే అతి పెద్ద కాలక్షేపం..అంతేకాదు బయట ఎండల బాధ తట్టుకునేకంటే కాసేపైనా ఎసిలో కూర్చోవచ్చనుకునే బ్యాచ్ కూడా కొందరుంటారు. కానీ ఈ సారి కరోనా  దెబ్బకి సమ్మర్ అంతా ఇళ్లల్లోనే గడిచిపోయేలా ఉంది.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోయాయి. షూటింగ్ జరుపుకున్న సినిమాలు  విడుదలకు నోచుకోలేదు..ఇప్పట్లో లాక్ డౌన్ ఎత్తేశేలా లేరు.. ఆ సినిమాలు విడుదలయ్యేలా లేవు.లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు పెద్ద సినిమాలేం రిలీజ్ కాలేదనుకుంటా.. మధ, ఓ పిట్ట కథ, పలాస లాంటి చిన్న సినిమాలు తప్ప.. లాక్ డౌన్ దెబ్బకి థియేటర్లు మూతబడడంతో ఆ సినిమాలు ఒటిటిల్లో దర్శనమిచ్చాయి . ఒక వేళ లాక్ డౌన్ లేకపోయుంటే ఈ పాటికి నాని V, అనుష్క “నిశ్శబ్దం”, సాయి ధరమ్ తేజ్ తమ్ముడి “ఉప్పెన” ఇలా ఎన్నో సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యుండేవి.

ఒకరోజు జనతా కర్ఫ్యూ  కాస్తా రోజులు పెంచుకుంటూ ముందుకు పోతూనే ఉంది. దాంతో లాస్ట్ ఇయర్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన కెజిఎఫ్ -2 మే లో విడుదలవాల్సి ఉండగా ఇయర్ ఎండింగ్ కి పోస్ట్పోన్ అయింది. ఈ లెక్కన ఈ సమ్మర్లో సినిమాలేం లేనట్టే.అంతేకాదు పెరుగుతున్న కేసుల దృష్ట్యాలాక్ డౌన్ పొడిగించే లక్షణాలే ఎక్కువ కనపడుతున్నాయి. మరి కొద్ది నెలల పాటు ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించక తప్పేట్లు లేదు.

ఈ లెక్కన చూసుకుంటే జనాలు ఎక్కువగా గేదర్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్న ప్రదేశాలన్నింటిని ఇంకొన్ని నెలలు ప్రారంభించకపోవచ్చు..జనాలు ఎక్కువగా గుమిగూడేందుకు ఆస్కారం ఉన్న వాటిల్లో సినిమా హాళ్లు కూడా ఒక్కటి . కాబట్టి మరి కొద్ది నెలలు థియేటర్లకు తాళం ఉంటుండొచ్చు.. ముందు కాలం అంతా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి ఒటిటిలదే అని ఎవరో అన్నట్టు, ఎప్పుడో రావాల్సిన ఒటిటి కాలం కరోనా పుణ్యమా అని కొంచెం ముందే వచ్చినట్టుంది..

 

 


End of Article

You may also like