“పోకిరి” గురించి చాలామందికి తెలియని 8 విషయాలివే…!

“పోకిరి” గురించి చాలామందికి తెలియని 8 విషయాలివే…!

by Anudeep

Ads

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు..”  ఈ డైలాగ్ మామూలు ఫేమస్ కాదు.. మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ పోకిరి వచ్చి నేటికి పద్నాలుగు ఏళ్లు పూర్తి.. మహేశ్ కెరీర్ చూస్కుంటే పోకిరికి ముందు పోకిరికి తర్వాత అని చెప్పుకునేంత సూపర్ హిట్..మహేశ్ ని సూపర్ స్టార్ ని చేసిన హిట్.. మహేశ్ ఫ్యాన్స్ ని అమాంతం పెంచేసిన హిట్..

Video Advertisement

ఆగండాగండి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరోవ్యక్తి పూరీ.. రాముడు మంచి బాలుడు లా ఉండే హీరో క్యారెక్టర్స్ ని పోకిరి, దేశముదురుగా మార్చిన క్రెడిట్ పూరిదే.. నేనెంత వెధవనో నాకే తెలీదు అని వెధవలందరికి ఎక్కడలేని గొప్పతనం అంటకట్టి, వాళ్లు కాలరెగరేసేలా చేసిన క్రెడిట్ కూడా పూరిదే…సర్లేండి  పూరీ టైటిల్స్ పై, డైలాగ్స్ పై వ్యతిరేకత అనేది ఉంది..అది ఇక్కడ మ్యాటర్ కాదు..ఇక్కడ మ్యాటరేంటంటే పోకిరి హీరో మహేశ్, హీరోయిన్ ఇలియానా, పూరీ డైరెక్టర్ ఇవన్ని తెలిసిన విషయాలే..తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం..

#1. “పండు” ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. ఉత్తమ్ సింగ్ ఇదేంటి ఇంత చెత్తగా ఉంది అనుకుంటున్నరా..నిజానికి పోకిరికి ముందు అనుకున్న టైటిల్ అదే ఉత్తమ్ సింగ్.. పంజాబ్ బ్యాక్ డ్రాప్లో కథ అనుకున్నారు.. కథ అంతా ఇదే కాకపోతే పంజాబ్ ఫ్యామిలిలో పెరిగిన కుర్రాడు, చివరికి అండర్ కవర్ కాప్ అని తేలుతుంది అనేది విషయం..పూరీ ఇదే స్టోరిలైన్ మహేశ్ కి చెప్తే, కథ ఒకె కాని బ్యాక్ డ్రాప్ , టైటిల్ బాగలేవు, ఛేంజ్ చేయమన్నాడట మహేశ్..

#2. ఎలాగూ హీరో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు కాబట్టి పోకిరి అని పెడితే ఎలా ఉంటుంది అని పూరి అడగడం మహేశ్ ఒకె చేయడం చకచకా జరిగిపోయాయి..ఇంతకీ పండు ఎవరో తెలుసా.. తన వైఫ్ లావణ్యని పూరి ముద్దుగా పండు అని పిలుచుకుంటున్నారు..ఆ పండు కాస్తా పండుగాడు అయ్యిందన్నమాట..

#3. ఏళ్లకేళ్లు సాగదీయకుండా షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చేయడం పూరికి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్, అదే తన అభిమానులకి తనలో నచ్చే అంశం కూడా..పోకిరి షూటింగ్ మొత్తాన్ని 70రోజుల్లో కంప్లీట్ చేశారు..అది కూడా సింగిల్ టేక్స్ లోనే ఒకె చేసేవారట పూరి..మహేశ్ కి మొదట్లో ఇదంతా కొత్తగా ఉన్నా, తర్వాత తనకి అలవాటైపోయిందట.

#4. “ఇలియానా” సెలక్ట్ చేయడానికన్నా ముందు హీరోయిన్ సెలక్షన్ గురించి పెద్ద కసరత్తే జరిగింది..అయేషా టకియా నుండి దీపికా పదుకునే వరకు ఎందరినో అనుకుని, కొందరు కొత్త వాళ్లని ఆడిషన్స్ చేసి ఎవరూ నచ్చక, చివరికి ఎవరో ఇచ్చిన సజెషన్ తో ఇలియానకి ఓటేశారు మహేశ్ ,పూరి.. అప్పటికి దేవదాసు సినిమాతో ఇలియానా కుర్రకారు మనసు దోచేసింది..పోకిరిలో తన అందచందాల్తో ఏకంగా వాళ్ల గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చునేలా మాయ చేసింది..

#5. గలగల పారుతున్న గోదారిలా పాటలో మహేశ్ , ఇలియాన మధ్య రొమాన్స్ ఇప్పటికి క్రేజే..ఒక సారి విదేశాలకు వెళ్లిన పూరికి అక్కడ వీదుల్లో గిటార్ ప్లే చేస్తున్న అతను పాడిన సాంగ్ వినగానే  ఇది మన తెలుగు పాటే అనుకున్నాడట, కాని నిజానికి తెలుగులో క్రిష్ణగారి గౌరి సినిమాలోకి ఆ పాటని ఇంగ్లీష్ సాంగ్ నే తెలుగులో గలగలపారుతున్న గోదారిలా అని తీశారని తెలిసి.. ఆ పాటని పోకిరిలో పెట్టారు. సినిమా ఎంత హిట్టో ఆ పాట అంత హిట్..

#6. “జగడమే” అని పాట వస్తుంటే ఇప్పటికి కుర్రాళ్ల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. విషయం ఏంటంటే ఆ సినిమా మొత్తానికి కెమెరామాన్ శ్యామ్ కె నాయుడు అయితే, ఈ పాటకి పని చేసింది మాత్రం కెవి గుహన్..  ఆ పాటలో మహేశ్ ఎక్స్ప్రెషన్స్, టేకింగ్, మేకింగ్,సినిమాటోగ్రఫి అన్ని కలగలిసి ఆ పాటకి అంత పేరు తీసుకొచ్చాయి..

#7. చాలా మైన్యూట్ ఛేంజెస్ కూడా ఒక్కోసారి పెద్ద రిజల్ట్స్ ని ఇస్తాయి..సినిమా క్లైమాక్స్ లో మహేశ్ బాబు ప్రకాశ్ రాజ్ ని లాగిపెట్టి గూబ గుయ్ మనిపించే సీన్లో బీప్ సౌండ్ వస్తుంది.. ఈ ఐడియా ఇచ్చింది ఫైట్ మాస్టర్ విజయన్.. ఈ సీన్ సూపర్ గా పండడానికి ఆ చిన్న చేంజే కారణం, ఆడియన్స్ ఇప్పటికి ఎంజాయ్ చేస్తారు..

#8. పోకిరి షూటింగ్ అయిపోయింది..ఎడిటింగ్ రూంలో ఎడిటింగ్ జరిగేప్పుడు కేవలం మహేశ్ ,పూరిలిద్దరికి తప్ప ఎవ్వరికి ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం లేదట..అంతేకాదు మాపియా, పోలీసులు..ఉమన్ రోల్స్ ఎక్కువ లేవు  ఎవరు చూస్తారు ఈ సినిమా అని ప్రొడ్యూసర్స్ రిజక్ట్ చేయడంతో ప్ మహేశ్, పూరి ఇద్దరే వారి సొంత బ్యానర్లో రిలీజ్ చేసారు..తర్వాత బాక్సాపీస్ బద్దలు కొట్టిన ఈ సినిమా హింది, తమిళ, కన్నడ,బెంగాళీలలో కూడా రీమేకై సూపర్ డూపర్ హిట్ అయింది..

 

 

 


End of Article

You may also like