Ads
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే పనిలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..అయితే మే 3 తరువాత కూడా పొడగించాలని ఇటీవలే ప్రకటించింది..దేశ వ్యాప్తంగా ఇంకో రెండు వారాల పాటు అంటే మే 17 దాఖా పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకుంది .దీనికి సంబందించిన ఉత్తరువులు నిన్న జారీ కూడా చేసింది.
Video Advertisement
దేశమంతా రాత్రి 7 నుంచి ఉదయం 7 దాకా అన్ని నాన్ ఎస్సెన్షియల్ సర్వీసులని బంద్ చేయాలని ఆదేశించింది కానీ జిల్లాల వారీగా రెడ్,ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా విభజించి కొన్ని వెసులుబాటులను కల్పించింది.అయితే అన్ని చోట్ల జోన్లతో సంబంధం లేకుండా ఉపాధి హామీ పనులు చేసుకునే అవకాశం కల్పించింది.వీటితో పాటుగా మరికొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిని ఇచ్చారు.
ఇకపోతే ప్రజా రవాణా సంస్థలు రైళ్లు,విమాన సర్వీసులు,షాపింగ్ మాల్స్,సినిమా హాళ్లు,కాలేజీలు,హోటళ్లు,రెస్టారెంట్లు, ఇంకా పూర్తి స్థాయిలో బంద్ చేయవలసిందే అని నిర్ణయించింది.కానీ ఆరెంజ్,గ్రీన్ జోన్లలో పరిమిత స్థాయిలోనే ఆయా జిల్లాల్లో రోడ్డు రవాణాకు అనుమతులు ఇచ్చింది. ప్రైవేట్ క్యాబ్స్ లో డ్రైవర్ తో పాటు కేవలం మరో ఇద్దరు మాత్రమే
ప్రయాణం కొనసాగించాలంటూ అనుమతులను ఇచ్చింది.ఇక గ్రీన్ జోన్స్ విషయానికి వస్తే 50 శాతం సీటింగ్ తో ఆర్టీసీ బస్సులను నడుపుకునేందుకు అవకాశం కల్పించింది..ఇకపోతే రాష్ట్రాల ఆదాయంలో కీలక పాత్ర పోషించే లిక్కర్ …కేవలం గ్రీన్ జోన్లలో వీటితో పాటు పాన్ షాప్ ఓపెన్ చేసుకుందుకు వెసులుబాటు కల్పించింది. కానీ అసలు షరతు ఏంటంటే ఒకేసారి షాప్ దగ్గర అయిదుగురు మించి ఉండటానికి వీలు లేదు.ఒక్కొక్కరు మధ్యన కనీసం రెండు మీటర్ల సామజిక దూరాన్ని పాటించాలని సూచించింది కేంద్ర హోమ్ శాఖ.
End of Article