బర్త్ డే స్పెషల్ :విజయ్ దేవరకొండ & సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలు

బర్త్ డే స్పెషల్ :విజయ్ దేవరకొండ & సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలు

by Anudeep

Ads

ఇద్దరూ ఇద్దరే … ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి  పరిశ్రమలో నిలదొక్కుకున్నవారే.. ఎన్నో ఏళ్లుగా  సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయిన పద్దతులకు భిన్నంగా వెళ్తున్నవారే.. కథల ఎంపిక దగ్గర నుండి సినిమా ప్రమోషన్ వరకు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నవారే.. ఇద్దరి పుట్టినరోజులు ఒకరోజే..నేడే..వారే విజయ్ దేవరకొండ మరియు సాయిపల్లవి..

Video Advertisement

ఎందరో యువహీరోలు ,హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తుంటారు పోతుంటారు.. కొందరి పేర్లు కూడా గుర్తుండవు చాలామందికి వారి ఖాతాలో హిట్లు ఉన్నప్పటికి కూడా.. కానీ సాయిపల్లవి,విజయ్ తమదైన మార్క్ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు..వారి తొలిసినిమాలు, రాబోతున్న సినిమాలు ఇలా అన్ని విషయాలు మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి కాని..వారిద్దరికి మాత్రమే ప్రత్యేకమైన కొన్ని విషయాలున్నాయి..అవేంటంటే..

పెళ్లిచూపులు దగ్గర నుండి వరల్డ్ ఫేమస్ లవర్ వరకు ప్రతి కథలో తనదంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది విజయ్ దేవరకొండకి..పెళ్లిచూపులు సినిమా విజయ్ కి ఒక రకమైన ఫ్యాన్ బేస్ నిఇస్తే,  అర్జున్ రెడ్డి మరొక రకమైన గుర్తింపుని ఇచ్చింది. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ గురించి ప్రత్యేక చర్చ జరిగింది. సెర్చింగ్ స్టార్టయింది..ఎవడు వీడు? ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాడు?ఇంతకుముందు ఏ సినిమాల్లో నటించాడు అంటూ రవిబాబు “నువ్విలా”లో , శేఖర్ కమ్ముల “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” విజయ్ నటించాడని తెలిసి షాకయ్యారు..”ఎవడే సుబ్రహ్మణ్యం” తో‌ కొంత గుర్తింపు పొందిన విజయ్ అర్జున్ రెడ్డి తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

ఇక సాయిపల్లవి , ఎక్కడో తమిళనాడులో పుట్టింది..మళయాలి “ప్రేమమ్” సినిమాతో పరిచయం అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఫిదా” సినిమాతో అందరూ తనకి ఫిదా అయ్యేలా మాయచేసింది. . హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి?  అరమందం మేకప్ తో ఉండాలి.. ఎప్పుడంటే అప్పుడు స్కిన్ షో చేయాలి.. హీరో పక్కన నాలుగు కుప్పిగంతులు వేసేలా ఉంటే చాలు..నటన మాట, ముఖంలో హావభావాల మాట డైరెక్టర్ ఎరుగు  కానీ సాయి పల్లవి ఆ టైప్ కాదు..ముఖం నిండా పింపుల్స్  ఉన్నా కూడా నిండైన ఆత్మవిశ్వాసం తన అందాన్ని రెట్టింపు చేస్తుంది.. కోటి ఇచ్చినా, రెండు కోట్లు ఇచ్చినా స్కిన్ షోకి  ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు.

ఇక ఇండస్ట్రీకి ఎందరో యువ హీరోలు వచ్చారు, నటించారు , వారి ఖాతాలో కొన్ని హిట్లు వేసుకున్నారు.చేతిలో సినిమాలు లేనప్పుడు డీలా పడ్డారు. తర్వాత  కనుమరుగయ్యారు. కానీ విజయ్ ఒక్కడిగా వచ్చాడు..ఒక్కడిగా నిలబడ్డాడు..సినిమా కెరీర్ ను కొనసాగిస్తూనే “రౌడీ” బ్రాండ్ తో రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ ప్రారంభించారు. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో మధ్యతరగతి జీవులకు బాసటగా “మిడిల్ క్లాస్ ఫండ్” క్రియేట్ చేసి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ బాటలో విజయ్ కి ఇండస్ట్రీలో పెద్ద వాళ్లు కూడా సపోర్ట్ చేశారు అది వేరే విషయం . లాక్ డౌన్ సమయంలో పనులు లేక కష్ట పడుతున్న పేదవారికి సాయం చేయడంలో కూడా విజయ్ తనదైన ముద్ర వేసుకున్నాడు.

సొసైటిలోనే కాదు ఇండస్ట్రీలో కూడా మేల్ డామినేషన్ సంగతి తెలిసిందే.కాని సాయిపల్లవి అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయదు..అందుకే తనకి ఆటిట్యూడ్ అనే విమర్శలను ఎదుర్కొంది..నిజాయితిగా ఉండేవాళ్లెప్పుడూ పొగరుగానే ఉంటారు..ఆ పొగరే వారికి అందం. నటనలో,డ్యాన్స్ లో  హీరోలతో పోటీపడి మరీ..కాదు కాదు హీరోలను మించి తన స్ట్లైల్లో మెరిసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. దానికి ఉదాహరణ రౌడీబేబి, ఏమండోయ్ నానిగారు పాటలే..యూట్యూబ్లో వాటి వ్యూయర్స్ సంఖ్య మిలియన్స్ లో ఉందంటే దానికి రీజన్ ఒన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి మరియు తన డ్యాన్సే..

స్కిన్ షో చేయకపోతే, ముద్దు సీన్లలో నటించకపోతే అవకాశాలు రావు కదా అనే ప్రశ్న సాయిపల్లవికి ఎదురైతే ఒక్కటే చెప్తుంది..ఎంచక్కా వెళ్లిపోయి డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకుంటా అని.. జార్జీయాలో ఎంబిబిఎస్ కంప్లీట్ చేసిన సాయిపల్లవి, కార్డియాలజిలో స్పెషలైజేషన్ కూడా చేయాలనుకుంది..ఇంతలోనే వరుస ఆఫర్లు వస్తుండడంతో తనలోని డాక్టర్ కు రెస్ట్ ఇచ్చి, యాక్టర్ గా వివిధ భాషల్లో రాణిస్తోంది.ఈ విలక్షణమైన జీవనశైలి తో అందరి మన్ననలు పొందుతూ…విభిన్నమైన నటనతో సినీ పరిశ్రమలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్న “రౌడీ బేబి” కి…”రౌడీ బాబు” కు తెలుగు అడ్డా హ్యాపీ బర్త్‌డే చెబుతోంది.


End of Article

You may also like