కరోనా నేపథ్యంలో…ఓ పాల వ్యాపారి క్రియేటివిటీ! వారేవ్వా… ఏమి ఐడియా బాసూ.!

కరోనా నేపథ్యంలో…ఓ పాల వ్యాపారి క్రియేటివిటీ! వారేవ్వా… ఏమి ఐడియా బాసూ.!

by Anudeep

Ads

అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము వెతకాలి..అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెతకాలి అని… పెద్ద ఎన్టీయార్ ఎప్పుడో, ఏదో సినిమాలో చెప్పారు..శ్రీకృష్ణ పాండవీయం అనుకుంటా ఆ సినిమా పేరు…ఈ కరోనా కాలంలో కెసిఆర్ లాంటి పెద్దలు కూడా అపాయకర కాలంలో ఉపాయంతో బతకాలంటూ జాగ్రత్తలు చెప్పారు..చెప్తూనే ఉన్నారు.ఉపాయంతో కరోనా అపాయాన్ని గట్టెక్కాలనే ఉద్దేశ్యంతో కెసిఆర్ మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ, ఆచరణలో పెట్టాడో పాలవ్యాపారి..

Video Advertisement

మూతికి మాస్కు, చేతులకి గ్లౌజు, బండికి మూడు అడుగుల పైపు.. అంటే తను పాలు పోసే వ్యక్తితో భౌతిక దూరం పాటిస్తూ పాలు పోస్తున్నాడు. అటు తన వ్యాపారాన్ని కొనసాగిస్తూనే, ఇటు కరోనా ముప్పుని దాటుకొని వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఢిపరెంట్ ప్లాన్ అమలు చేశాడు.. ఏ పుట్టలో ఏ పాముందో… పాలు తీసుకునే వాళ్లల్లో ఎవరికి  కరోనా ఉందో తెలీదు..లేదంటే పాలు తీసుకునే వారికి తన నుంచి ఏ ఆపదా రాకూడదనుకున్నాడో . భౌతిక దూరం ఇద్దరికి మంచిది అనుకున్నాడో కానీ ఈ ఐడియా మాత్రం వారెవ్వా అనిపించేలా చేస్తుంది. భౌతిక దూరం, పాలవ్యాపారం రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కొత్త టెక్నిక్ తో కరోనా కాలంలో తన వ్యాపారాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్నాడు ఈ పాలవ్యాపారి..అతను ఎవరో, ఏ ప్రాంతానికి చెందిన వాడో కాని, సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫోటో అందరిని అబ్బురపరుస్తుంది.

ఈ కరోనా ఇప్పుడప్పుడే పోయేటట్లు లేదు. ఎలాగూ దీనితో కలిసి బతకాల్సిందే అని అనధికారికంగా డిక్లేర్ చేసినట్టే, కాబట్టి ప్రస్తుతానికే కాదు, తర్వాత కాలంలో కూడా భౌతికదూరం పాటించాల్సిన అవసరం ఉంది..సో మిగతా పాల వ్యాపారులు జర సోంచాయించుర్రీ… ఈ ఐడియా ఏదో బాగుంది.. అందరికి బాగుంటుంది..


End of Article

You may also like