నా పెళ్లి రోజు ఈ పెన్ తో సంతకం పెడుతుంటే….ఒక విషయం గుర్తొచ్చి మీతో పంచుకుంటున్నాను.

నా పెళ్లి రోజు ఈ పెన్ తో సంతకం పెడుతుంటే….ఒక విషయం గుర్తొచ్చి మీతో పంచుకుంటున్నాను.

by Megha Varna

Ads

నా  10th బర్త్డే నాడు నాకు చాల గిఫ్ట్స్ వొచ్చాయ్…అందులో ఒక కాస్ట్లీ పెన్ కూడా ఉంది.! అప్పట్లోనే దాని రేట్ 2000 అంట.! దాని బాక్స్ చూస్తేనే అర్థం అవుతుంది దాని లెవెల్ ! నాకు చిన్నప్పటి నుండి  ఇష్టమైన వాటిని ఒక పెట్టెలో దాచిపెట్టే అలవాటుంది. అలా ఆ పెన్ ను కూడా ఆ బాక్స్ లో దాచేసా .!రోజూ స్కూల్ నుండి రావడం …ఆ బాక్స్ తెరవడం ఆ పెన్ ను చూసుకోవడం …మళ్ళీ అందులోనే దాచేయడం.! ఇలా ఒక వారం గడిచింది. తరవాత వారానికోసారి…..ఆ తర్వాత నెలకోసారి పెన్ ను చూసుకునేదానిని…తర్వాత గుర్తొచ్చినప్పుడు చూసుకునేదానిని ! నేను ఇంటర్ కు వచ్చేసాను …ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి…. ఈ ప్రాజెక్ట్ వర్క్ ను నాకిష్టమైన పెన్ తో రాయాలని అనుకున్నాను….

Video Advertisement

పెట్టెను తెరిచి ….నా పెన్ బాక్స్ ను సీల్ తీసి ..1 …2 ….3 …. స్టార్ట్ ….పెన్ పడడం లేదు. జనరల్ గా మనందరికీ తెలిసిన విద్యే …పెన్ పడకపోతే షేక్ చేయడం …చేసాను…నో యూస్…అయినా పడట్లేదు.. ..అసహనం పెరిగిపోతుంది ..కోపం వొస్తుంది…బాధయితుంది ….చివరకు పెన్ తీసి పడేయాల్సివొచ్చింది.నిజమే కదా! మనదగ్గర యెంత విలువైంది ఉన్నప్పటికీ…దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి.. లేకుంటే ఇలా వేస్ట్ అయిపోతుంది. మన లోని సామర్థ్యాలు కూడా అంతే.! లేదంటే నా పెన్ లాగే అయిపోతుంది.!ఇది ఫోటో ..నా పెళ్లి రోజుది ..పెళ్లి సంతకం చేయడానికి నేను 10 రూపాయల పెన్ ను వాడాను.


End of Article

You may also like