Ads
“మెరుపు మెరిస్తే…వాన కురిస్తే
Video Advertisement
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే కూనల్లారా
బుడతల్లారా…అయిదారేడుల పాపల్లారా…”
అని శ్రీశ్రీ ఆ తరం చిన్నారుల గురించి చెప్పారు.
ఇప్పుడు నడుస్తోంది 4జి యుగం…ఆలోచనల్లోనే కాదు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలోనూ ఈనాటి తరం అందర్నీ అబ్బురపరుస్తోంది…అంతెందుకు ముంబాయి కి చెందిన మూడేళ్ల కబీర్ అనే బుడతడి సంగతే తీసుకొండి…ఈ 4జి తరపు బాలుడి సంకల్పం, చూపిన పట్టుదల,సాధించిన ఘనత తెలుసుకుంటే శభాష్ బేటా అనకుండా ఉండలేరు..
కేక్ అనగానే చిన్నపిల్లలు వావ్ అంటూ పరిగెత్తుకొచ్చేస్తారు..అంత ఇష్టం వారికి కానీ ముంబైకి చెందిన కబీర్ అనే మూడేళ్ల బాలుడు ఏకంగా కప్ కేకులను తయారు చేశాడు. కబీర్ అనే ఓ మూడేళ్ల బాలుడు కప్ కేకులు తయారు చేశాడు. కేకులు తినే వయసులో వాటిని తయారు చేయడమేంటని ఆశ్చర్యగా ఉందా? కానీ అదే నిజం.. ఈ కేకులు తయారు చేసింది తనకోసం కాదు, దాని వెనుక పెద్ద సంకల్పమే ఉంది.తను సొంతంగా తయారు చేసిన కేకులను అమ్ముతూ, ఆ వచ్చిన డబ్బును కరోనా వ్యతిరేక పోరుకు విరాళంగా ఇచ్చాడు.
కబీర్ తల్లిదండ్రులు కరిష్మా, కేశవ్ లతో కలిసి ముంభై పోలీస్ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ ను కలిసి,తాను తెచ్చిన విరాళాన్ని అందించాడు కబీర్. చిన్నపిల్లాడు ఏ ఐదో, పదివేలో పాకెట్ మనీ తెచ్చుంటారు అనుకున్నరు పోలీసులు..కబీర్ కూడా ముందు 10వేలు సంపాదించి ఇవ్వాలి అనుకున్నడు.కానీ రోజురోజుకి డబ్బులు వస్తూనే ఉన్నాయి.దాంతో మరింత హుషారుగా తను అనుకున్న పనిచేశాడు. మొత్తం 50వేలు సంపాదించాడు..కబీర్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది..
కబీర్ చేసిన మంచి పనికి ముచ్చటపడిన ముంబై కమీషనరేట్ పోలీసులు తన గురించిన వీడియో సోషల్ మీడియాలో శేర్ చేసారు..ఈ బుజ్జాయి కేవలం విరాళం మాత్రమే ఇవ్వలేదు..కరోనా టైంలో పోలీసులు చేస్తున్నసేవకు గానూ తను చేసిన కప్ కేక్స్ ని కొన్నంటిని పోలీసులకు తినిపించాడు..సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ లిటిల్ ఎంట్రప్రెన్యూర్ స్టోరీ ప్రస్తుతం వైరల్ టాపిక్ గా మారింది.
End of Article