Ads
దగ్గుబాటీ సురేష్ స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ కు టాలీవుడ్ లో ఎంత ప్రాముఖ్యత ఉందొ మనకి తెలిసిందే.దగ్గుబాటి సురేష్ కొడుకు రానా దగ్గుబాటి హీరోగా శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా విషయం తెలిసిందే.కాగా బాహుబలి చిత్రంలో బల్లాలదేవునిగా తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తిండిపోతాడు రానా దగ్గుబాటి.అయితే తాజాగా రానా తన వివాహానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో పంచుకున్నారు.కాగా ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
రానా దగ్గుబాటి వివాహం చేసుకోబుతున్న అమ్మాయి మిహిక బజాజ్.తాను ఎస్ చెప్పింది అని రానా బాగా ఎక్ససిట్మెంట్ ఫీల్ అవుతూ వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు.రానా లాంటి భారీ ఎత్తు మరియు కండలు కలిగిన హీరో టాలీవుడ్లో ఎవరూ లేరనే చెప్పాలి.అలంటి రానా ఒక అమ్మాయి విషయంలో ఇంత హ్యాపీ ఫిల్ అవుతున్నారేంటి అని అందరి ఆసక్తి మిహిక బజాజ్ ఎవరు తన తల్లితండ్రులు ఎవరు అని తన పర్సనల్ లైఫ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు నెటిజన్లు.
మిహిక బజాజ్ తండ్రి సురేష్ బజాజ్ తల్లి బంటి బజాజ్.వీరికి క్షలా అనే జ్యుయలరీ షాప్ ఉంది.ఇండియాలోని బెస్ట్ జ్యుయలరీ సంస్థలలో క్షలా ఒకటి.తల్లి బంటి బజాజ్ హైదరాబాద్ లోనే చదువుకున్నారు.తల్లి బంటి బజాజ్ వెడ్డింగ్ ప్లానర్ మరియు ఈవెంట్ ప్లానర్.దేశంలోనే గురింపు తెచ్చుకున్న ఈవెంట్ మేనేజర్ తల్లి బంటి బజాజ్.మిహిక సోదరుడు సామర్ద్ క్షలా జ్యుయలరీ షాప్ ను చూసుకుంటూ ఈవెంట్ మేనేజ్మెంట్ ను కూడా చూసుకుంటూ ఉంటాడు.
మిహిక హైదరాబాద్ మరియు ముంబైలో చదువుకున్నారు.కాగా లండన్ లో ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఇంటీరియర్ డిజైన్ మరియు ఫ్యాషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.ముంబై లో సోదరుడు సామర్ద్ ప్రారంభించిన ఓ కంపెనీ వలన బాలీవుడ్ లో మిహిక కు పరిచయాలు ఏర్పడ్డాయి.కాగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రీత మిహికకు మంచి స్నేహం ఉందట.తన ద్వారానే రానా కు మిహిక పరిచయం అయ్యింది అనే వార్త వైరల్ అవుతుంది.అశ్రీతకు వీరి ప్రేమ గురించి ముందునుండి తెలుసు అని సినీ వర్గాలలో టాక్ కూడా వినిపిస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లి అనే వార్త వచ్చింది అంటే ఇలాంటి కామెంట్స్ ఎన్నో వస్తూనే ఉంటాయి కదా?
End of Article