నీళ్ల‌ల్లో ఎలుక ఎంత‌సేపు ఉండ‌గ‌ల‌దు? మ‌న‌లోని శ‌క్తిని మన‌కు తెలిసేలా చేసిన‌ ప్ర‌యోగమిది.!

నీళ్ల‌ల్లో ఎలుక ఎంత‌సేపు ఉండ‌గ‌ల‌దు? మ‌న‌లోని శ‌క్తిని మన‌కు తెలిసేలా చేసిన‌ ప్ర‌యోగమిది.!

by Megha Varna

Ads

1950 దశకంలో ….హార్వార్డ్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ కర్ట్ రిక్టర్ ఎలుకలపై ఓ ప్రయోగాన్ని చేసాడు. మొదట ఆ ప్రయోగం చూద్దాం …తర్వాత మనుషులుగా దాని నుండి మనమేం నేర్చుకోవాలో లెక్కలేసుకుందాం.

Video Advertisement

రిక్టర్ ..ఓ జార్ లో సగానికి నీళ్లు పోసి…అందులో ఓ ఎలుకను వదిలేసాడు. కాసేపు బాగానే ఉన్న ఎలుక తర్వాతర్వాత శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతుంది. అయిన అలాగే వెయిట్ చేసాడు రిక్టర్ …ఫైనల్ గా 15 నిమిషాల తర్వాత ఎలుక నీటిలో పడిపోడాన్ని గమనించిన రిక్టర్ దాన్ని బయటకు తీసాడు. కాసేపు విశ్రాంతినిచ్చి….రెండో రౌండ్ మళ్ళీ నీటిలో ముంచాడు. ఈ సరి ఎలుక ఎన్ని నిముషాలు ఉండొచ్చని మీ అంచనా…?

5 నిముషాలు? 10 నిముషాలు? 15 నిముషాలు ?….కాదు, కాదు,కాదు ….ఏకంగా 60 గంటలు…. ఆశ్చర్యంగా ఉందా?  ఇది 100 శాతం వాస్తవం. ఈ ప్రయోగం ద్వారా నిర్దారించిన విషయం ఏంటంటే..ఎలుకకు తెలుసు తను పడిపోయే సమయంలో ఎలాగైనా తనను బయటకు తీస్తారని…అందుకే తన ఓపికున్నంత సేపు నీటి పైనే ఉండాలని ట్రై చేసిందట.

ఇప్పుడు మనిషి విషయానికి వొద్దాం : ఆఫ్ట్రాల్ ఓ ఎలుకే …తన స్థాయికి మించి పోరాటం చేసినప్పుడు …మరి మనం? పని ప్రారంభించకముందే మనమీద మనకే డౌట్ చేయగలమా ? లేదా ? అని …. మన శక్తిపై కూడా మనకు నమ్మకముండదు. హెన్స్…. పై ప్రయోగం ద్వారా మీలో ఏమైనా మార్పు వస్తే….ఆ రిక్టర్ గారికి థాంక్స్ చెప్పి…మీ లైఫ్ ను సక్సెఫుల్ గా కొనసాగించండి.


End of Article

You may also like