Ads
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా సామాన్యుడు, సెలబ్రిటి అని తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు..మరికొందరు ఎక్కడి వాళ్లక్కడే ఆగిపోయారు.. వాళ్ల వాళ్ల ఇన్ఫ్లూయెన్స్ లు ఉపయోగించి ఎక్కడికన్నా వెళ్లడానికైనా కరోనా ఊరుకోదుగా అనే భయంతో ఆగిపోయారు.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిచ్చిన వాళ్లు నానా తిప్పలు పడి తాము చేరాలనుకున్న గమ్యం చేరుకుంటున్నారు.. అలాంటి ఇబ్బందులే పడ్డారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్..
Video Advertisement
తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించిన బాలివుడ్ యాక్టర్ స్వరభాస్కర్. పలు సామాజిక అంశాలపై కూడా స్పందించే స్వరభాస్కర్ అందరికి సుపరిచితురాలే..స్వర భాస్కర్ తల్లి ఇరా భాస్కర్ ఢిల్లీలో నివాసం ఉంటారు.. ఢిల్లీలోని JNU(జవహర్ లాల్ నెహ్యూ యూనివర్శిటి)లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. లాస్ట్ వీక్ ప్రమాదానికి గురైన ఇరా భాస్కర్ భుజానికి తీవ్ర గాయమైంది..లాక్ డౌన్ ఉండడంతో తల్లిని చూడడానికి వెళ్లలేకపోయిన స్వర భాస్కర్ ఫోన్లోనే తల్లి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంది.
లాక్ డౌన్ నిబంధనలు సడలించగానే ఒక్క క్షణం ఆలోచించకుండా కార్ తీసుకుని ఢిల్లికి బయల్దేరింది.1400 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం… మార్గ మధ్యలో ఉదయ్ పూర్ వద్ద నైట్ హాల్ట్ చేసి, చివరకు ఢిల్లీకి చేరుకుంది..తల్లిని కలుసుకోగానే తన గాయం గురించి ఆరా తీసి, హమ్మయ్యా అని సంతోషపడిందో లేదో..ఢిల్లీ పోలీసులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు..14రోజుల పాటు సెల్ఫ్ హోం క్వారంటైన్ లో ఉండి తీరాల్సిందే అని అధికారులు చెప్పడంతో దానికి ఒప్పుకున్న స్వరభాస్కర్ ..మొత్తానికి అమ్మను చూడగలిగా అని సంతోషం వెలిబుచ్చింది.
లాక్ డౌన్ 4.0లో కొన్ని సడలింపులు ఇవ్వగానే చాలామంది ప్రయాణాలు మొదలుపెట్టారు..యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖి కూడా ఫ్యామిలితో ముంబై నుండి సొంత గ్రామానికి పయనమై వెళ్లాడు..అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా టెస్టులు చేసారు అధికారులు. ..రిజల్ట్ నెగటివ్ వచ్చింది..అయినప్పటికి 14 రోజుల పాటు సెల్ఫ్ హోం క్వారంటైన్ లో ఉండాలి అని అధికారులు ఆదేశించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య 50లక్షల మార్కుని దాటింది..ఇప్పటి వరకు 3లక్షలపైన మరణాలు సంభవించగా..మన ఇండియాలో మరణాల సంఖ్య 3,435గా నమోదైంది.. 1,12,359 కొవిడ్ -19 కేసులు నమొదయ్యాయి.. లాక్ డౌన్ సడలింపులతో రోజువారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి..ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎవరికి వారే స్వచ్చందంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది..
End of Article