Ads
ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చిన్నా బిన్నం చేస్తుంది ….దీనివలన యావత్ ప్రపంచం లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లకే పరితం అవ్వడం.ఎటు వంటి కార్యకలాపాలు గాని,క్రీడలు గాని నడవటం లేదు..వ్యాక్సిన్ వచ్చే వరకు మనం ఈ కరోనా తో పోరాడాల్సిందే అంటున్నారు నిపుణులు..అయితే ఇప్పటికే భారత్ లో జరగాల్సిన ఐపీల్ టోర్నమెంట్ కూడా వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది క్లారిటీ లేకుండా పోయింది.
Video Advertisement
లాక్ డౌన్ 4 లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఇంకా వైరస్ తగ్గుముఖం పట్టలేని కారణంగా స్టేడియం లకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు..t20 వరల్డ్ కప్ కూడా ఇదే ఏడాది అక్టోబర్ లో జరగాల్సి ఉండగా..ఇప్పుడు దాని మీద కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బార్డర్ ఐపీల్ పై సంచలన కామెంట్స్ చేసారు..ఒకవేళ t20 ప్రపంచ కప్ కూడా రద్దయితే ఐపీల్ కి ఎవరు ఆడవద్దు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు.కేవలం డబ్బు కోసమే అంతర్జాతీయ మ్యాచుల కంటే డొమెస్టిక్ క్రికెట్ కి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు?కానీ బీసీసీఐ మాత్రం t20 వరల్డ్ కప్ రద్దు అయితే ఐపీల్ ని నిర్వహించే పనిలో ఉన్నట్టు సమాచారం..ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్ ని కూడా జులై నుంచి శ్రీలంక పర్యటనతో మొదలు పెట్టాలని ఎదురు చూస్తుంది..ఇదే ఏడాది అక్టోబర్ నవంబర్ లలో ఇంగ్లాండ్ భారత పర్యటన ఉన్నందున బీసీసీఐ ఎలా చేస్తుందనేది వేచి చూడాల్సిందే.
End of Article