బంధువులు బెగ్గర్ గా మార్చారు…ఆమె పాఠాలు విన్న విద్యార్థులు ఆ టీచర్ కు సహాయం అందించారు.! కానీ చివరికి?

బంధువులు బెగ్గర్ గా మార్చారు…ఆమె పాఠాలు విన్న విద్యార్థులు ఆ టీచర్ కు సహాయం అందించారు.! కానీ చివరికి?

by Megha Varna

Ads

జీవితం ఎవరికి ఎలాంటి మర్చిపోలేని మలుపు ఇస్తుందో ఎవరికీ తెలియదు.కాలం చేసే మాయ ఏంటో ఎవరికీ అర్ధం కాదు.రాజులా బ్రతికినవాడు కూడా కాలం కలిసి రాక బిచ్చం ఎత్తుకునే సంఘటనలు కూడా మనం చాలానే చూసాం.తాజాగా కేరళలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.ఆ విషయం తెలిస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు..జుట్టు మాసిపోయి చిరిగిపోయిన బట్టలతో పిచ్చి ఎక్కిన వ్యక్తి లా ఉన్న ఓ మహిళ చాలా కష్టంగా పాడైపోయిన ఆహారం తింటుంది.అటుగా వెళ్తున్న ఓ మహిళ ఆ సంఘటన చూసింది.అయితే ఆమెకు సదరు మహిళను చూసి ఎంతో బాధకలగడంతో పక్కనే ఉన్న హోటల్ నుండి టిఫీన్, వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆమెకు ఇచ్చారు…ఈ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

ఆమె పేరు వల్స..కేరళలోని మలప్పురం ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకురాలిగా సేవలు అందించి రిటైర్ అయ్యారు.కాగా వల్స కు ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు ఉన్నాడు.అయితే వల్స ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత ఆదాయం ఏమి లేకపోవడంతో ఆమె కొడుకు మరియు బంధువులు ఆమెను భారంగా భావించారు.అయితే తనను రోడ్ మీద వదిలేసారు.దీంతో వల్స రోడ్ల మీద బిచ్చం ఎత్తుకుంటూ దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి ఈ సంఘటన ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి తనకు సహాయం చేయాల్సిందిగా కోరారు. అయితే ఇదివరకు ఆమె దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఈ విషయం తెలిసి తనకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు.

 

అయితే తన విద్యార్థుల దగ్గర నుండి సహాయం పొందడం తనకు ఇష్టం లేదని నా కుటుంబ సభ్యులతోనే ఉండాలని ఉంది అని వల్స తెలిపారు.కాగా తనను కావాలనే వదిలించుకొని రోడ్ మీద వదిలేసిన కుటుంబ సభ్యులు దగ్గరికి వెళ్ళద్దు అని, మీ విద్యార్థుల దగ్గర నుండి సహాయం పొందండి అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మళ్ళీ ఆ నరక కూపంలో చిక్కుకోవద్దు అని వల్స కు సూచిస్తున్నారు ఆమె విద్యార్థులు .


End of Article

You may also like