Ads
మొదటిసారి అమ్మానాన్నని వదిలి బంధువులింటికి వెళ్లాడు ఐదేళ్ల పసివాడు.. ఉంటే ఉన్నాడు..లేదంటే తిరిగి పంపించేయొచ్చు అనుకున్నారు..కానీ ఆ పిల్లాడు అటు వెళ్లగానే లాక్ డౌన్ ప్రకటించడంతో తిరిగి రాలేకపోయాడు..ఎలాగోలా తీసుకురావడం కుదిరే పని కాదు..చిన్నారి వెళ్లింది ఢిల్లీకి , తల్లిదండ్రులున్నది బెంగళూరులో.. రెండు నెలల లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో సొంత ఊరికి పయనమయ్యాడు అది కూడా ఒక్కడే..
Video Advertisement
బెంగళూరుకు చెందిన విహాన్ శర్మ లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. లాక్‌డౌన్ వల్ల తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. దాంతో చేసేదేం లేక విహాన్ ని అక్కడే ఉంచేసుకోవాల్సి వచ్చింది.ఆ చిన్నారికి తన తల్లిదండ్రులు గుర్తు రాకుండా తనకు నచ్చినట్టు ఉండేలా,తనకి నచ్చిన ఫూడ్ వండి పెడుతూ,తను కావాలన్నది ఇస్తూ బాగా చూస్కున్నారు బంధువులు.
ఎంత బాగా చూస్కుంటున్నా..రోజురోజుకి విహాన్లో తల్లిదండ్రులపై బెంగ పెరిగిపోతూనే ఉండేది..కానీ ఏం చేయలేని పరిస్థితి.అదే విషయాన్ని విహాన్ కి అర్దం అయ్యేలా చెప్తే, కరోనా వెళ్లిపోయాక నేను మా ఇంటికి వెళ్లిపోవచ్చా..మా అమ్మానాన్నని కలిసి,వాళ్లతో ఆటలాడుకోవచ్చా అని అమాయకంగా అడిగేవాడు..వీడియోకాల్స్ వలన కొంత ఉపశమనం ఉన్నప్పటికి విహాన్ కి తన పేరెంట్స్ ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఉండేది.
ఇంతలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించిందే ఆలస్యం..విహాన్ కి ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు బంధువులు. బుడ్డోడికి మాస్కు, ప్లాస్టిక్ షీల్డ్ గ్లవుజులు తొడిగి భద్రంగా స్పెషల్ కేటగిరీ కింది విమానం ఎక్కించారు. విమాన సిబ్బంది బాబుని కూర్చొబెట్టి, సీట్ బెల్ట్ పెట్టి ఢిల్లీ నుండి బెంగళూరు ప్రయాణం వరకు మరింత జాగ్రత్తగా చూసుకున్నారు.
విమానం బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. వాడి కోసం కళ్ల కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తల్లి బిడ్డ కనిపించగానే పరుగున వెళ్లి ఒడిలోకి తీసుకుంది.తనతో పాటు ఎవరూ లేకుండా విమానంలో నుండి దిగుతున్న విహాన్ పైనే ఎయిర్పోర్ట్ లో అందరి కళ్లు..ఇదిలా ఉంటే తన చేతిలోని స్పెషల్ కేటగిరి బోర్డ్ చూపిస్తూ మనోడు మరింత పోజు కొట్టాడు..అమ్మని చూసిన ఆనందం కదా… వాడి ముఖంలో రెండు నెలల బెంగ అంతా పోయింది.
End of Article