మాట నిలబెట్టుకున్న కెటిఆర్…లాక్ డౌన్ విధుల్లో మృతిచెందిన హోమ్ గార్డ్ కుటుంబానికి అండగా..!

మాట నిలబెట్టుకున్న కెటిఆర్…లాక్ డౌన్ విధుల్లో మృతిచెందిన హోమ్ గార్డ్ కుటుంబానికి అండగా..!

by Anudeep

Ads

అన్నా , సాయం అని అడిగితే వెంటనే స్పందించే వాళ్లల్లో కెటిఆర్ ముందుంటారు..అటువంటిది తనే స్వయంగా సాయం చేస్తా అని మాట ఇచ్చాక ఎలా సాయం చేయకుండా ఉంటారు..ఇటీవల మరణించిన హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి కెటిఆర్..మరణించిన హోంగార్డు కూతురికి ఉద్యోగం ఇప్పించి ఆ కుటుంబంలో తిరిగి సంతోషం నింపారు.

Video Advertisement

రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన హోంగార్డు సిలువేరి దేవయ్యా.. లాక్ డౌన్ విదుల్లో వడదెబ్బ తగిలి ఏప్రిల్ 15న మరణించాడు..  తర్వత ఏప్రిల్ 24వ తేదీన దేవయ్య కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి కెటిఆర్.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.. 5లక్షల రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు దేవయ్య కూతురు నవ్యకి ఉద్యోగం కల్పిస్తామని మాటిచ్చారు.

screenshot from etv telangana youtube video

అప్పుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని దేవయ్య కూతురు సిలివేరు నవ్యకి  వేముల వాడ రూరల్ మండల్ పరిషత్ కార్యలయంలో ఈజిఎస్ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇప్పించారు. దేవయ్య కుటుంబసభ్యులు కెటిఆర్ కి కృతజ్ణతలు తెలుపారు..నవ్య మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు నాన్న చనిపోవడంతో అంతా ఆగమాగం అయింది. కెటిఆర్ అన్న మాట ఇచ్చినంక కొంచెం ధైర్యం వచ్చింది. కెటిఆర్ నాకు దేవుడిచ్చిన అన్న..అన్న చూసిన కొలువు చేసుకుంటూ కుటుంబాన్ని చూస్కుంటా అని నవ్య కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.


End of Article

You may also like