Ads
ఫ్యాక్షన్ సినిమాలనగానే మనకి గుర్తొచ్చేవి సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఆది…ఇలా మరికొన్ని.. వీటిల్లో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించింది దర్శకుడు బెజవాడ గోపాల్ అదేనండి బి.గోపాల్.. ఫ్యాక్షన్ సినిమాలకు ఆద్యుడు అని కూడా అంటుంటారు..కానీ వీటన్నింటి కంటే ముందు కొన్నేళ్ల క్రితం వచ్చిన తొలి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా వచ్చింది.. అదే “ఊర్వశి” శారద ప్రధాన పాత్రలో , తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “కడప రెడ్డెమ్మ”.
Video Advertisement
1990 లో వచ్చిన కడప రెడ్డమ్మ సినిమాలో ఊర్వశి శారద ప్రధాన పాత్ర పోషించగా, మోహన్ బాబు, ఆనంద్, రంజిత,చలపతిరావు, నర్రా వెంకటేశ్వర్రారు, గిరిబాబు మరియు అన్నపూర్ణ ఇతర పాత్రల్లో నటించారు…తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని చలపతిరావు నిర్మించడం విశేషం.. మాటల మాంత్రికులు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు పదునైన డైలాగ్స్ ని అందించారు..పాటల పరంగా కొంచెం సోసోగా సాగినప్పటికి ప్రధాన నటుల నటన అందరిని ఆకట్టుకుని సినిమా అందరికి నచ్చే విధంగానే ఉంటుంది..కథ విషయానికి వస్తే..
ఒక ఊళ్లో కులం పేర, వర్గం పేర ఆఖరికి పార్టీ పేర కూడా నిత్యం ఘర్షణలు చెలరేగుతుంటాయి..అటువంటి ఊర్లో రెండు వేరువేరు కులాలకు చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకుంటారు.. ప్రేమలు,పెళ్లిల్లు నిశిద్దమైన చోట కులాల పేర అగ్గిరాజేసుకునే చోట తమ ప్రేమ పెళ్లి వరకు దారితీయదని గ్రహించిన ఆ ప్రేమ జంట ఊరి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటారు..ఎక్కడో సుఖంగా బతుకుతున్నప్పటికి వారికి ప్రాణభయం పోదు..చివరికి వారి పెద్దలే వారి ప్రాణాలను బలిగొంటారు.
వారికి పుట్టిన బిడ్డని రక్షించుకోవడం కోసం ఊరి పెద్దలపై తిరుగుబాటు చేస్తుంది కడప రెడ్డమ్మ..ప్రేమజంటగా ఆనంద్, రంజిత నటించారు, ఆనంద్ వదినగా శారద, తండ్రిగా చలపతిరావు నటించగా …రంజిత అన్నగా మోహన్ బాబు, తాతగా నర్రా కనిపిస్తారు.. పారిపోయి వచ్చిన ప్రేమజంటకి ఆశ్రయం ఇచ్చే పాత్రలో అన్నపూర్ణ నటించారు..మోహన్ బాబు,చలపతిరావు వారి ముఖ కవలికల్లోనే విలనిజాన్ని పండించారు. గడపలోపలే ఉండే ఆడది ఆదర్శాలు వల్లిస్తే ఎలా అంగీకరిస్తారు అంటూ వచ్చే కొన్ని పదునైన డైలాగులు ఆలోచింపచేస్తాయి…చూడదగ్గ ఫ్యాక్షన్ చిత్రం కడప రెడ్డమ్మ..
End of Article