Ads
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఎంత వైవిధ్యమైన నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే కమల్ కూతురిగా చిత్రసీమ కు పరిచయమయ్యి తండ్రికి తగిన తనయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్.అయితే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు శృతి హాసన్.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
కరోనా కారణంగా ప్రపంచమంతా చాలా పెద్ద విపత్తును ఎదుర్కొంటుంది అని అన్నారు శ్రుతి హాసన్.అయితే ప్రజలు కూడా కరోనా వైరస్ కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గాని లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని శ్రుతి హాసన్ అన్నారు.అయితే నేను గత మూడు సంవత్సరాల నుండి మానసిక సమస్యతో బాధపడుతున్నా అని అయితే దానికి సంభందించిన చికిత్సను కూడా తీసుకుంటున్న అని శ్రుతి హాసన్ చెప్పారు.
ఎప్పుడూ ఆన్లైన్ లో ప్రేక్షకులతో ముచ్చటిస్తూ ఉండే శ్రుతి హాసన్ మొదటిసారిగా తన మానసిక సమస్య గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు .అయితే ప్రతీరోజు ధ్యానం యోగ ,వ్యాయామం చేస్తున్నానని మానసిక సమస్యను తిప్పి కొట్టాలంటే ఇవి చెయ్యడం తప్పనిసరి అని శ్రుతి హాసన్ అన్నారు
End of Article