ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాని ధైర్యంగా చెప్పిన ద్యుతి గురించి ఈ విషయాలు తెలుసా?

ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాని ధైర్యంగా చెప్పిన ద్యుతి గురించి ఈ విషయాలు తెలుసా?

by Mohana Priya

Ads

ప్రేమకి కులం మతం జాతి లాంటి భేదాలు ఏమి అడ్డు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రేమకి ఆడా మగా అన్న తేడా కూడా అడ్డు కాదు అనేది తెలుసుకోవలసిన విషయం. దీనిపై ఎంతో కాలం పోరాడితే ప్రభుత్వం గే లెస్బియన్ ప్రేమలను కూడా చట్టబద్ధం చేసింది. రెండేళ్ల క్రితం భారతదేశంలో కూడా ఈ చట్టం వచ్చింది.

Video Advertisement

ఎన్నో విషయాలని చట్టబద్ధం చేసినా జనాలు వాటిని ఆచరించడానికి ఎంతో సమయం పడుతుంది. అలానే ఈ విషయంపై కూడా జనాలు ముందుకు వచ్చి తమ ప్రేమను వ్యక్తం చేయలేకపోయారు. అలాంటి సమయంలో అందరూ ముందు తను ఒక మహిళను ప్రేమిస్తున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు క్రీడాకారిణి ద్యుతి చంద్.

ఒడిస్సా కి చెందిన ఈ స్ప్రింటర్ 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలు 100 200 మీటర్ల విభాగాలలో రజత పతకం సాధించింది. 2019 లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో స్వర్ణం అందుకున్న తొలి మహిళ స్ప్రింటర్ ద్యుతి. టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టైమ్స్ నెక్స్ట్ హండ్రెడ్ జాబితాలో కూడా ద్యుతి చోటు సంపాదించుకుంది. వృత్తిలో కూడా దూసుకుపోతున్న ద్యుతి ఈ మధ్యనే తను కూడా వేరే యువతిని ఇష్టపడ్డాను అని బహిర్గతంగా చెప్పింది. తన స్వలింగ బంధం గురించి బయటపెట్టిన తొలి క్రీడాకారిణి ద్యుతి.

తన బంధానికి ఎంతమంది ఎన్నిరకాలుగా పేరు పెట్టినా తను మాత్రం దీనిని మామూలు ప్రేమ అనే చూస్తాను అని చెప్పింది. తను ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించింది. అనుకున్నట్టే అందరూ ఈ విషయాన్ని అంత తొందరగా స్వీకరించలేదు. ద్యుతి తల్లి కొంచెం పరిణితితో ఆలోచించమని ఎంతో వారించారు. తను అప్పటికే తన స్నేహితులని ప్రేమించి ఉండటంతో ఆ విషయం కూడా పెద్దలకు చెప్పేసింది. పెళ్లి జరగకపోయినా జీవితాంతం తనతోనే ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పింది. ద్యుతి మాటలను ఎవరూ లెక్క చేయలేదు.

ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తర్వాత ద్యుతి కి ప్రభుత్వం మూడు కోట్లు బహుమానం ప్రకటించింది. దాంతో ద్యుతి సోదరి ఆ డబ్బులు తనకు ఇవ్వాలని లేకపోతే తన గురించి జనాలు అందరికీ చెప్పేస్తాను అని బెదిరించింది. మొదట భయపడిన ద్యుతి తన అడిగినంత ఇచ్చేది. కానీ ఒకరోజు తట్టుకోలేక ధైర్యం చేసి తన ప్రేమ విషయం అందరిముందు బయట పెట్టింది. కొంతమంది విమర్శించినా, చాలామంది ద్యుతి ధైర్యానికి మెచ్చుకున్నారు. ఎందరో సెలబ్రిటీలు కూడా ద్యుతి కి మద్దతు పలికారు.

ద్యుతి ప్రేమించింది తన స్నేహితురాలిని. వీరిద్దరూ గత ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ద్యుతి ఎప్పుడు ఊరు వెళ్ళినా తనతోనే గడుపుతుంది. భవిష్యత్తులో కూడా తనతోనే జీవించాలి అనుకుంటుంది అని, అలా అని తనతోనే ఉండమని ఎప్పుడూ బలవంతం పెట్టను అని చెప్పింది. ఒక అమ్మాయి తో ప్రేమలో ఉంటే సమాజంలో ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి అనేది నేను ఊహించగలను. కానీ వాటిని తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది.

ఇదంతా చూసిన ద్యుతి తల్లిదండ్రి తన ప్రేమ కి ఎటువంటి అడ్డుచెప్పలేదు. కానీ ద్యుతి అక్క మాత్రం ఆ అమ్మాయి తో కలిసి ఉంటే ఇంట్లో నుంచి గెంటేస్తాను, అలాగే జైలుకు కూడా పంపిస్తాను అని హెచ్చరించింది. ద్యుతి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. తను తన అథ్లెటిక్స్ కొనసాగిస్తానని. ఒలంపిక్స్ కి వెళ్లడం తన లక్ష్యం అని, అందుకోసం తాను కృషి చేస్తాను అని చెప్పింది.ఇలా తామేంటో ప్రపంచానికి చెప్పడానికి ఎంతోమంది ధైర్యాన్నిచ్చింది ద్యుతి.

images source: instagram/duteechand

source: vasudhara


End of Article

You may also like