గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది ఖుష్బూ వరస

గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది ఖుష్బూ వరస

by Megha Varna

Ads

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది ప్రస్తుతం నటి ఖుష్భూ పరిస్థితి .. మీడియాని అనాల్సిన మాటలు అనేసి తీరా ఆ ఆడియో లీక్ అయ్యేసరికి అది తనది కాదంటూ..ఎడిట్ చేసారంటూ..ఎవరో కావాలని లీక్ చేసారంటూ తనకు తోచినట్టుగా ట్వీట్లు చేసి చివరికి మీడియాకి క్షమాపణ చెప్పిందనుకోండి..ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది..ఖుష్బూ ఎందుకు అంత కంగారు పడింది..

Video Advertisement

లాక్ డౌన్ సడలింపుల తర్వాత సినిమా షూటింగ్ లకు  పర్మిషన్ ఇవ్వడంతో తమిళనాడు సినిమా పెద్దలంతా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి ఖుష్బూ కూడా హాజరయింది.కానీ అక్కడకు వెళ్లడానికి ముందు ఒక వ్యక్తితో కాల్ మాట్లాడింది.. ఆ వ్యక్తి ఒక నిర్మాత అనే విషయం కూడా ఖుష్బూ ట్వీట్ వలనే తెలిసింది..ఆ కాల్ లో.. “చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం..ముఖ్యమైన వాళ్లని తప్ప ఎవరిని మీటింగ్ కి అనుమతించకూడదు..ముఖ్యంగా మీడియా వాళ్లని ..వాళ్లకి కరోనా వార్తలు తప్ప ఏం లేవు, ఇంక మన ఫొటోలు తీసి వాళ్లకి నచ్చిన రాతలు రాసుకుంటారు..” ఇది ఖుష్బూ మాట్లాడిన మాటలు.

ఈ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయింది..లీక్ చేశారని అనుకుందాం..ఈ ఆడియోపై మీడియవాళ్లు ఎవరూ మండిపడలేదు సరి కదా..కనీసం రెస్పాండ్ కాలేదు.. కానీ ఖుష్భూ మాత్రం.. ఆ ఆడియోలో గొంతు నాది కాదు అని ఒక ట్వీట్ చేసింది..సరే ఆమెది కాదేమో అని అనుకునేలోపే..అది ఎవరో ఎడిట్ చేసి లీక్ చేశారు..అందులో సగం మాత్రమే ఉంది..అంటే తనది అని ఒప్పుకున్నట్టే..మిగతా సగం ఏంటో అని నవ్వుకుని ఊరుకున్నారు తప్ప పెద్దగా పట్టించుకున్నది లేదు..

ఇక చివరికి మీడియా వారిని క్షమాపణలు కోరుతున్నారు..నన్ను ఇన్నేళ్లనుండి చూస్తున్నారు..ఎప్పుడైనా మీపట్ల తప్పుగా ప్రవర్తించానా? ఆ ఆడియో ఏ నిర్మాత రిలిజ్ చేశాడో నాకు తెలుసు, కానీ నేను తన పేరు చెప్పను..నా మౌనమే తనకు శిక్ష అని ముచ్చటగా మూడు ట్వీట్ల ద్వారా ఆ ఆడియో టేపులో ఉన్నది తన గొంతే అని తన నోటితోనే ఒప్పుకుంది..అయినా సెలబ్రిటి స్థానంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవద్దా.. అసలే ఇంటర్నెట్ యుగం మన మైండ్లో అనుకున్న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోయేంత స్పీడ్ యుగం.. ఇంత జరిగినా మీడియా ఏమన్లేదు..ఇప్పుడు ఎందుకు అంటుంది సమయం వచ్చినప్పుడు తన ప్రతాపం చూపిస్తుంది.


End of Article

You may also like