రాఘవేంద్రరావు పండ్ల దెబ్బ తినని హీరోయిన్లు వాళ్లిద్దరే…దానికో కారణం ఉందంట.!

రాఘవేంద్రరావు పండ్ల దెబ్బ తినని హీరోయిన్లు వాళ్లిద్దరే…దానికో కారణం ఉందంట.!

by Megha Varna

Ads

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు..కమర్షియల్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, ప్రేమకథలు ఆఖరికి భక్తిరస చిత్రాలు అన్ని రకాల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత రాఘవేంద్రరావు సొంతం..అన్ని రకాల చిత్రాలు తీసినప్పటికి, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నప్పటికి రాఘవేంద్రరావు అనగానే అందరికి గుర్తొచ్చేది హీరోయిన్లు-పాటలు-పండ్లు అనే కాన్సెప్టే..

Video Advertisement

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటల్లో ఎక్కువగా పండ్లను ఉపయోగిస్తారనేది టాక్..ఆఖరికి కొబ్బరికాయను కూడా వదల్లేదు ఝుమ్మందినాదం సినిమాలో.. ఆ సినిమాలో నటించిన తాప్సీ ..  బాలివుడ్ కి వెళ్లిన తర్వాత ఆ విషయంలో కామెంట్స్ చేసింది అది వేరే విషయం..ఆయన సినిమాల్లో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్ పై ఆయన ఈ పండ్ల కాన్సెప్ట్ ని ప్రయోగించారు..కానీ జయసుధ,జయప్రదపై మాత్రం ఉపయోగించలేదట..

ఒక టీవి చానెల్ కి సంబంధించిన ప్రోగ్రాంలో ఇదే విషయం ప్రస్తావనకు రాగా..రాఘవేంద్రరావు ఆసక్తికర సమాధానం చెప్పారు..జయసుధ,జయప్రదని చూస్తే అసలు నాకు అలాంటి ఆలోచనే వచ్చేది కాదు..వాళ్లని చూడగానే నిండుదనం ఉట్టిపడుతున్నట్టుగా అనిపించేది..అయినా నేను సినిమాల్లో పండ్లను ఉపయోగించింది యాభై సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత..కానీ అందరూ నా ప్రతి సినిమాలో ఆ కాన్సెప్ట్ వాడినట్టుగా చెప్తుంటారు అని అన్నారు.


End of Article

You may also like