Ads
పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కరోనా భారిన పడ్డారు.ఈమధ్యకాలంలో ఆఫ్రిది లో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.గురువారం నుండి నా ఆరోగ్యం అసలు బాగోలేదు నా శరీరమంతా నొప్పులు వస్తున్నాయి నేను త్వరగా కారణం నుండి బయటపడడానికి మీ ప్రేయర్స్ కావాలి అని ట్విట్టర్ లో తెలిపారు షాహిద్ ఆఫ్రిది…
Video Advertisement
కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి షాహిద్ ఆఫ్రిది చాలా కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు.అంతేకాకుండా మస్క్లు,సానీటిజర్లు కూడా పంపిణి చేసారు.షాహిద్ ఆఫ్రిది చేసిన సేవకు గాను భారత్ క్రికెటర్ల ప్రశంసలు కూడా పొందారు.ఇప్పటిదాకా కరోనా వైరస్ భారిన పడిన రెండవ పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది.మొదటగా కరోనా వైరస్ భారిన పడిన పాక్ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ ఇప్పటికే కరోనా వైరస్ బారి నుండి బయట పడ్డారు.ఇప్పటిదాకా ఆఫ్రిది 398 ODI లు ,27 టెస్ట్ మ్యాచ్లు ,99 T 20 మ్యాచ్లు ఆడారు.కాగా 2017 సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు ఆఫ్రిది.
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah #COVID19 #pandemic #hopenotout #staysafe #stayhome
— Shahid Afridi (@SAfridiOfficial) June 13, 2020
End of Article