ధోనీ బయోపిక్ “యం.ఎస్. ధోనీ.. అన్ టోల్డ్ స్టోరీ” చిత్రం ద్వారా యావత్ భారత ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్..బలవన్మరణాకి పాల్పడ్డాదు. ముంబైలోని తన ప్లాట్‌లో ఉరి వేసుకుని మరణించాడు.. సుషాంత్ మరణంతో బాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది..సుశాం త్ఇప్పటివరకు చేసినవి మంచి సినిమాలే..ఇకపై చేయడానికి చేతిలో సినిమాలున్నాయి..మరి సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకి పాల్పడ్డాడు..ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి.మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి..
Also read: వైరల్ అవుతున్న సుశాంత్ 50 కలల లిస్ట్
డిప్రెషనే కారణమా?
సుశాంత్ మరణ వార్త తెలియగానే డిప్రెషన్ కారణంగానే మరణించాడు అనే వార్తలు వచ్చాయి..లాక్ డౌన్ కారణంగా కొంతకాలంగా ఒక్కడే ఉంటున్న సుశాంత్ డిప్రెషన్ కి గురయ్యాడని, వాటికి బలం చేకూరుస్తూ డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటన్నట్టుగా సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యం అయ్యాయి..స్వయంగా సుశాంతే తన ఇన్‌స్టా అకౌంట్లో గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికి..ఈ నియమాలు మాత్రమే తనకి బాగాపనిచేసాయంటూ నిద్ర,మెడిటేషన్, యోగా ఇలాంటి కొన్ని సూచనలతో ఒక పోస్టు పెట్టారు..అది చూస్తంటే తను డిప్రెషన్ నుండి బయటకి రావడానికి తన వంతు కృషి చేసినట్టుగా అర్దం అవుతోంది.
Also read: కంటతడి పెట్టిస్తున్న “సుశాంత్” ఇంస్టాగ్రామ్ చివరి పోస్ట్.
డిప్రెషన్ లోకి వెళ్లడానికి గల కారణమేంటి?? సుశాంత్ సింగ్ స్వతహాగా తెలివైన వాడు.. చదువుపరంగా కూడా చాలా చురుకైనవాడు..నేషనల్ లెవల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్,ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్‌లో నేషనల్ వైడ్ 7 ర్యాంక్ సాధించాడు.. ..తన ఇన్‌స్టా అకౌంట్ గమనిస్తే ఎప్పుడూ ఫిజిక్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన పోస్టులే ఎక్కువ కనిపించేవి..ప్రస్తుతం తన అకౌంట్ నుండి తను చాలా పోస్టులను డిలీట్ చేసాడు..
Also read: సుశాంత్ మరణవార్త తెలియగానే అతని మాజీ ప్రేయసి “అంకిత” స్పందన ఇదే.
స్టడీలో జెమ్ అయినప్పటికి యాక్టింగ్ పై ఇంట్రస్ట్‌తో ఇండస్ట్ట్రీ వైపొచ్చాడు. తన కాళ్లపై తను అంచెలంచెలుగా ఎదిగాడు.. పవిత్ర రిస్తా అనే బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన సుశాంత్ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.. సఫలం అయ్యాడు..ధోనీ,చిచోరే, పీకే ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు..మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్నాయి….మరి దేనికి డిప్రెషన్??
ప్రేమ వ్యవహరం .. కారణమా??
పవిత్ర రిస్తా సీరియల్లో సుశాంత్ సరసన నటించిన అంకితా లోకండేతో ఆరేళ్లగా ప్రేమలో ఉన్నాడు సుశాంత్.ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతారనగా బ్రేకప్ అయింది.. 2016లో వీరిద్దరూ విడిపోగా ప్రస్తుతం అంకితా విక్కి జైన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు..అంకితతో విడిపోయిన తర్వాత సుశాంత్ కొంతకాలం కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నారు..కృతిసనన్ తో డేటింగ్ సమయంలో ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు సుశాంత్..తర్వాత అది కూడా బ్రేకప్ అయింది..ప్రస్తుతం రియా చక్రవర్తితో డేటింగ్లో ఉన్నారు..వీరిద్దరూ లాక్ డౌన్ పీరియడ్‌లో కూడా కలిసి ఉన్నారనే వార్తలు వచ్చాయి.
Also read: సుశాంత్ ఆత్మహత్యకు కొన్నిగంటల ముందు ఏం జరిగింది?
మేనేజర్ ఆత్మహత్య…
ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితమే సుశాంత్ మేనేజర్ దిశ సలైన్ ఆత్మహత్య చేసుకుంది..నాలుగేళ్ల క్రితం సుశాంత్ దగ్గర మేనేజర్ గా పనిచేసిన దిశ ప్రస్తుతం వరుణ్ శర్మకి మేనేజర్ గా వర్క్ చేస్తుంది.. నాలుగు రోజుల క్రితం దిశ 14అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.దిశ మరణంపై సుశాంత్ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా స్పందించాడు..
ఇన్‌స్టాలో “It’s such devastating news. My deepest condolences to Disha’s family and friends. May your soul rest in peace.”ఈ విధంగా పోస్టు పెట్టాడు…నాలుగురోజుల్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ రెండు ఆత్మహత్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి..పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
ఏది ఏమైనప్పటికి అన్నింటికి ఆత్మహత్యే పరిష్కారం కాదు..సుశాంత్ లాంటి తెలివైన వ్యక్తులు కూడా ఇలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవడం విచారకరం. బాలివుడ్ కి చాలా గడ్డు కాలం నడుస్తుందని చెప్పవచ్చు..ఒక్కొక్కరుగా బాలివుడ్ నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నారు..ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్..ఇప్పుడు యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలివుడ్ నే కాదు,యావత్ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది..
Also read: చదువులో టాపర్…నటన కోసం చదువు మానేసి…చివరికి ఇలా ? సుశాంత్ లైఫ్ స్పెషల్ స్టోరీ