Ads
ఎంత వేదన అనుభవించి ఉంటాడు.. ఎంత నరకయాతన పడి ఉంటాడు..ఉరితాడుని మెడకి బిగించుకునే ముందు..తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉంటాడు..కానీ విధిరాత వేరుగా ఉంటే తాను మాత్రం ఏం చేయగలడు.తనువు చాలించడం తప్ప.. అయిపోయింది.. సుశాంత్ వెళ్లిపోయాడు.. తను కన్న కలల్ని కల్లలుగా చేసి వెళ్లిపోయాడు..
Video Advertisement
ఒకటి రెండు కాదు..మొత్తం యాభై కలల్ని కన్నాడు..వాటిని పేపర్ పై రాసుకున్నాడు.. ఎప్పటికైనా ఆ కలల్ని తీర్చుకోవాలని గుర్తుగా ఆ పేపర్ ని పెట్టుకున్నాడు..ప్రస్తుతం ఆ పేపర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.. తన కలలు మాత్రం సుశాంత్ తో పాటే వెళ్లిపోయాయి.. ప్రతి కల కూడా తన వ్యక్తిత్వాన్ని ప్రతి బింబింప చేస్తుంది..
“ఎప్పటికైనా లెఫ్ట్ హ్యాండ్ తో క్రికెట్ ఆడాలి” అనేది ఒక కల.. “విమానం ఎలా ఎగురుతుందో తెలుసుకోవాలి”.. క్రియ యోగా నేర్చుకోవాలి,” అంటార్కిటికాని విజిట్ చేయాలి”.. “ఒక సాయంత్రం కాలేజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి”.. తన గురించి మాత్రమే కాదు సమాజం గురించి ఆలోచించాడు..
సమాజానికి ఏం చేయాలో ఆ కలలు రాసుకున్నాడు.. “మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ కి శిక్షణ ఇప్పించాలి”.. నిజమే ఇప్పటి పరిస్థితుల్లో మహిళలకు కావల్సింది అదే కదా..100 మంది పిల్లలనైనా ఇస్రో /నాసా వర్క్ షాప్ కి పంపించాలి..పిల్లలకు ఉచిత విద్య అందించాలి.. వెయ్యి మొక్కలు నాటాలి….
వారం క్రితమే కదా తండ్రికి ఫోన్ చేసి వచ్చే వారం వస్తాను, నిన్ను బయటికి తీస్కెళ్తాను అని చెప్పడు..కానీ ఆ తండ్రికి తన చావు కబురుని పంపాడు..ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ముఖం చాటేశాడు.. ఎప్పటికి క్షమించరాని తప్పు చేశాడు..
End of Article