‘తల్లిదండ్రులని దోచేస్తున్నారు’ ! విద్యా సంస్థలపై డైరెక్టర్ వెంకీ వేసిన ట్వీట్ కరెక్ట్ అంటారా ? మీరేమంటారు?

‘తల్లిదండ్రులని దోచేస్తున్నారు’ ! విద్యా సంస్థలపై డైరెక్టర్ వెంకీ వేసిన ట్వీట్ కరెక్ట్ అంటారా ? మీరేమంటారు?

by Anudeep

Ads

ప్రస్తుతం కరోనా మహమ్మ్మరి..ప్రపంచాన్ని వణికించేస్తోంది.రోజురోజుకి తగ్గకపోగా..మరింత జూలు విరుస్తుంది.దీనితో ప్రజల జీవితం అస్థ వ్యస్థానంగా గా మారింది.సంపాదన లేకపోగా..ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది..లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చినా ఎక్కడ బయటికి వెళ్లి వ్యాపారాలు,గాని ఉద్యోగాలు కానీ.చేసుకోలేని పరిస్థితులు.కరోనా మహమ్మారితో అటు ప్రభత్వాలు తో పాటుగా ప్రజలు కూడా పోరాడుతున్నారు.ఇప్పటికే ప్రభుత్వాలు పరీక్షలను కూడా రద్దు చేసారు..కరోనా ప్రభావం తగ్గితే కానీ తిరిగి ప్రజా జీవితం మునుపటిలా మారే మార్గం కనపడటం లేదు

Video Advertisement

విద్యార్థులు కూడా బయటకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి కారణంగా..విద్యా సంస్థలు ఆన్లైన్ లోనే తరగతులను భోదించే విధంగా స్కూల్,కాలేజీ యాజమాన్యాలు సన్నాహాలు చేసారు.ఇదే అదునుగా చూసుకున్న కొన్ని విద్యా సంస్థలు ప్రజలనుంచి అధిక ఫీజులు,వసూలు చేస్తున్నారని,,ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒక ట్వీట్ పెట్టారు ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి తన స్నేహితులు కూడా ఇదే రకమైన పరిస్థిలుతులు ఎదురుకున్నారని సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు.

‘నా స్నేహితుల్లో చాలా మంది స్కూల్ ఫీజులు పెరగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ క్లాసుల పేరిట డబ్బు దోచుకుంటున్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు డబ్బును లాగుతున్నారు. మరి కొన్ని అయితే బస్ ఫీజులు కూడా తీసుకుంటున్నాయట. అదే నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి క్రైసిస్‌లో కూడా అసహాయతలో ఉన్న మనుషుల నుంచి లాభాలను గడించాలని కొందరు ఇలాంటివి చేస్తున్నారు. దేవుడే మమ్మల్ని రక్షించాలి..అంటూ ట్వీట్ చేసారు.ఇప్పుడు ఇది నెట్ లో వైరల్ గా మారింది !

 


End of Article

You may also like