Ads
భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ .తాజాగా రామ్‌గోపాల్ వర్మ మరో సంచలన బయోపిక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.
Video Advertisement
BREAKING NEWS: My next film on RGVWORLDTHEATRE is titled POWER STAR ..it will be starring P K, M S , N B , T S, a Russian woman , four children , 8 buffaloes and R G V ..No prizes will be given for understanding who the characters are #RGV’sPOWERSTAR
— Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020
పవన్ కల్యాణ్‌పై సినిమా చేయనున్నట్లు సోసల్ మీడియా ద్వారా ప్రకటించాడు దర్శకుడు వర్మ.ట్విటర్ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నా కొత్త సినిమాకు ‘పవర్ స్టార్’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్ఎస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు,మరియు ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పవన్ కల్యాణ్ పాత్రను చేసింది ఇతడే అంటూ ఒక వీడియో విడుదల చేశాడు వర్మ. అతడు మా ఆఫీస్ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం అని , ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం అంటూ తన దైన శైలిలో ట్విట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ .అయితే వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Here is the STAR of my new film POWER STAR …This shot was taken when he visited my office ..Any resemblance to any other person is incidentally coincidental and intentionally unintentional.. pic.twitter.com/geulQ4YAj8
— Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020
End of Article