కరోనా బాధితుల్లో కొత్తగా మరో మూడు లక్షణాలు… వైరస్ సోకిన 2-14 రోజుల్లో కనిపిస్తాయి!

కరోనా బాధితుల్లో కొత్తగా మరో మూడు లక్షణాలు… వైరస్ సోకిన 2-14 రోజుల్లో కనిపిస్తాయి!

by Anudeep

Ads

నాకు తిరుగు లేదు అని విర్రవీగిన మనిషిని..కంటికి కనిపంచని వైరస్ కదలకుండా చేస్తోంది..” ఇంతకుముందు తనకు ఇష్టమున్నట్టు బతికిన మనిషిని తన ఇష్టాలకు దూరం చేసింది..కేవలం భౌతిక దూరం మాత్రమే మనకి కరోనా సోకకుండా చేస్తుందని ,దానితో పాటు వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని ముందు నుండి చెప్పుకుంటున్నాం..అందుకే ఈ లాక్ డౌన్ .. దాంతో పాటు మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే కరోనా బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే మాట కూడా వింటున్నాం.

Video Advertisement

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటగా.. 5,01,480 ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. ఈ సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మన భారత దేశంలో 5 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 15 వేల మందికి పైగా మరణించారు.


ఇది ఇలా ఉండగా…కరోనా లక్షణాల్లో తాజాగా మరో మూడు గుర్తించారు వైద్య నిపుణులు. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు. కరోనా లక్షణాలు వైరస్ సోకిన రెండు నుండి పద్నాలుగు రోజుల్లో కనిపిస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా లక్షణాలు..

  • ఫీవర్
  • వణుకు
  • దగ్గు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • అలసట
  • ఒళ్లు నొప్పులు
  • తలనొప్పి
  • రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం
  • గొంతునొప్పి
  • ముక్కు దిబ్బడ
  • వాంతులు
  • డయేరియా

Also Read >> శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే >>Click Here


End of Article

You may also like