Ads
మావత్వం మనుషుల్లో నశించిపోతుంది.కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారంటే తోటి వారు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చితకబాదేస్తున్నారు.వీళ్ళు మనుషులా, మృగాలా అన్న సందేహం చూసిన వారికి రాక మానదు.గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ..సాటి మనిషిని కూడా గౌరవించటం తెలియట్లేదు.ఇలాంటి ఒక ఘటన నెల్లూరు లో జరిగింది.కేవలం మాస్క్ వేసుకోమని చెప్పినందుకు మహిళ సీనియర్ అసిస్టెంట్ ని డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు అతి కిరాతకంగా చితక బాదారు.
Video Advertisement
నెల్లూరు లోని పర్యాటక శాఖ కార్యాలయం లో ఈ సంఘటన జరిగింది.ఉద్యోగం నుంచి తక్షణం తీసివేస్తూ ఉత్తరువులు జారీ చేసింది ప్రభత్వం.సీసీ టీవీ ఫ్యూటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు పోలీసులు.గతం లో కూడా సహా ఉద్యోగినీలకు వేధింపులకు గురి చేసినట్టు కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్ట్ చేసిన పోలీసులు..కోర్ట్ ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
End of Article