Ads
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన చోట కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు చీటింగ్ కేసు సంగతి తెలిసిందే .ప్రముఖ నటి సాయి సుధ తనని శారీరకంగా వాడుకొని వదిలేసాడు అంటూ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన తరువాత పోలీసులు అరెస్ట్ చేసారు.ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసాడని చీటింగ్ కేసు పెట్టారు పోలీసులు..అనంతరం రిమాండ్ కి తరలించారు.
Video Advertisement
కానీ శ్యామ్ కే నాయుడు అరెస్ట్ అయిన కేవలం రెండు రోజులకే విడుదల అయ్యారు.కానీ నటి సాయి సుధ తో కాంప్రమైజ్ అయినట్టుగా కోర్ట్ కి పత్రాలు సమర్పించటం తో..బెయిల్ మంజూరు చేసింది కోర్ట్ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది..అదేంటి అంటే..సాయి సుధ సంతకం ఫోర్జరీ చేశారట..బెయిల్ కోసం!.విషయం తెలుసుకున్న సాయి సుధ…తన సంతకం ఫోర్జరీ చేసి బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపిస్తూ..
దీనితో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బెయిల్ పిటీషన్ తెచ్చుకున్నారని కోర్ట్ ని ఆశ్రయించింది సాయి సుధ..తను కాంప్రమైజ్ అయినట్టు లేదా ఒప్పుకున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆరోపించారు.అసలు కారణం తెలుసుకున్న న్యాయస్థానం..ఉన్నపలంగా బెయిల్ ని రద్దు చెయ్యడమే కాకుండా.ఫోర్జరీ చేసినందుకు మరొక కేసు నమోదు చేసారు శ్యామ్ కే నాయుడు మీద.
End of Article