Ads
భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ .
Video Advertisement
లాక్ డౌన్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవా తో “క్లైమాక్స్ ” అనే చిత్రాన్ని నిర్మించి ఆన్ లైన్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే క్లైమాక్స్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ఆసక్తి రేపడంతో ఆన్ లైన్ లో ఈ చిత్రం విడుదల అయిన మొదటి గంటలోనే ఈ చిత్రాన్ని చూసేందుకు లక్షల సంఖ్యలో ప్రేక్షకులు పోటీపడ్డారు.దీంతో ఒక్కసారిగా ఆ వెబ్ సైట్ క్రాష్ కు గురయ్యింది.ఈ చిత్రాన్ని విడుదల అయిన మొదటిరోజే 3 లక్షల కంటే ఎక్కువమంది చూసినట్టు తెలుస్తుంది. కాగా క్లైమాక్స్ చిత్రాన్ని ఆన్ లైన్ వేదికగా ఒక్క వ్యూ కి 100 రూపాయలు చెల్లించే విధంగా విడుదల చేసారు.
క్లైమాక్స్ విడుదల చేసి పదిరోజులు కూడా గడవకముందే “నగ్న౦” అని విడుదల చేసారు వర్మ. ఈ సారి రేట్ పెంచేశారు. 100 రూపాయల నుండి 200 రూపాయలు చేసారు. ఆడియన్స్ వీక్నెస్ పట్టుకొని సినిమాకి ప్రొమోషన్స్ చేస్తూ ఉన్నారు వర్మ. ఇటీవల కాలంలో ఎన్నో ఇంటర్వూస్ కూడా ఇస్తూ ప్రొమోషన్స్ చేస్తున్నారు వర్మ. అరగంట నిడివి కూడా లేని చిత్రాలతో కోట్లు సంపాదిస్తున్నాడు. పైగా ఆ చిత్రానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. అయిదు లక్షల్లోపే ఓ సినిమాను తీసేస్తున్నారు.
నెక్స్ట్ పవర్ స్టార్ బయోపిక్ ప్లాన్ లో ఉన్నారు. అలాగే మిర్యాలగూడ పరువు హత్య ఆధారంగా అమృత స్టోరీ తీస్తున్నారు. కరోనా పై ఓ చిత్రం. ఈ లాక్ డౌన్ లో ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. ఇంకా చాలా సినిమాలే తీసే ప్లన్స్ ఉన్నాయంట వర్మకి. ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ వెళ్లడం వర్మకే సొంతం అనుకుంట.
End of Article