సీరియల్ నటికి కరోనా…జ్వరంతోనే షూటింగ్ కి… షాక్ లో టీం.!

సీరియల్ నటికి కరోనా…జ్వరంతోనే షూటింగ్ కి… షాక్ లో టీం.!

by Anudeep

Ads

ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళించి వేసింది అంతే కాదు అటు ఆరోగ్యాలతో పాటు …వారి ఆర్థిక జీవితాలు ప్రశ్నర్థకంగా మారిపోయాయి..చిన్న పెద్ద ….పేద ధనిక అంటూ తేడా లేదు, ఎమ్మెల్యేలు,సినీ తారలు ,క్రికెట్ ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడటం మనం చూసాము.ఇటు తెలంగాణ , ఆంధ్ర లో కూడా పలువురు రాజకీయా నాయకులకి సైతం కరోనా మహమ్మారి కబళించిన సంగతి తెలిసిందే

Video Advertisement

.లాక్ డౌన్ లోని సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం..షూటింగ్ లకి అనుమతులు మంజూరు చెయ్యగా..అటు సినిమా షూటింగ్లు,ఇటు సీరియల్ షూటింగ్లు పున ప్రారంభించిన సంగతి తెలిసిందే…అయితే కరోనా ఉదృతి తీవ్రంగా ఉండటంతో..తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ మహమ్మారి కాటు దెబ్బ పడకుండా తప్పించుకోవటం కష్టంగా మారింది.

మొన్నే మధ్యే సీరియల్ ఆర్టిస్ట్ హీరో ప్రభాకర్ కి సైతం కరోనా సోకటంతో హుటాహుటిన షూటింగ్స్ ఆపేసి అందరికి కరోనా పరీక్షలు చెయ్యడమే కాకుండా క్వారంటైన్ కి కూడా తరలించాల్సి వచ్చింది..ఈ ఘటన మరువక ముందే స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే ఆమె కథ హీరోయిన్ నవ్య స్వామికి కరోనా టెస్ట్ చెయ్యగా…పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.గత కొంత కాలంగా కూడా నవ్య స్వామి అనారోగ్యం తో బాధ పడుతూ ఉండేవారు..ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేల డంతో సహా నటులు కూడా ఆందోళన చెందుతున్నారు.అంతే షూటింగ్ సమయంలో కొందరు నటులు జ్వరం లాంటి లక్షణాలు ఉన్నాయట.

కన్నడ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న నవ్య స్వామి…ఆమె కథ సీరియల్ తో పటు మరో ఛానల్ ఈటీవీలో ప్రసారం అయ్యే … నా పేరు మీనాక్షి తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటం తో మళ్ళీ ఇప్పుడు సీరియల్ షూటింగ్స్ వాయిదా పడక తప్పేలా లేదు

 


End of Article

You may also like