Ads
ప్రముఖ సీరియల్ నటి నవ్య స్వామి కి ఇటీవలే చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తెలియడం తో..ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురయ్యింది. దీనితో అలెర్ట్ అయిన సీరియల్ బృందం సహచర నటీనటులకు కూడా వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ కి పంపే ప్రయత్నం చేస్తున్నారు …విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.కరోనా భారిన పడిన తరువాత మొదటి సారి ప్రముఖ దిన పత్రికకు కు ఇంటర్వ్యూ ఇచ్చారు ….
Video Advertisement
నేను కరోనా భారిన పడిన వార్త నిజమే ..ఇటీవలే జరిగిన వైద్య పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ చేశారు.ఇక షూటింగ్స్ అన్నే మానేయాలని ఆలోచనకి వచ్చాను గత కొద్ది రోజులుగా తీవ్రమైన అలసట, తలనొప్పి ఉండటంతో డాక్టర్ ని సంప్రదించగా కోవిడ్ టెస్టులు చేయించుకోమని సూచించారు …వైద్య పరీక్షల్లో పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది .వెంటనే క్వారంటైన్ కి వెళ్ళిపోయాను.ఇప్పుడు నేను బాగానే ఉన్నాను లక్షణాలు కూడా తగ్గినట్టు కనిపిస్తున్నాయి.కరోనా బారిన పడిన రోజున రాత్రంతా ఏడ్చాను.నాతో పాటుగా మా అమ్మ కూడా ఏడుస్తూనే ఉన్నారు. నా స్నేహితులు ఎందరో ఫోన్ చేసి మాట్లాడారు వారితో నా బాధను పంచుకున్నాను
కరోనా నాకు సోకిందని వార్త కంటే కూడా నాపై వచ్చిన వార్తలే నాన్ని బాధ పెట్టాయి. నా పై వచ్చిన రూమర్స్ నన్ను మరింత బాధించాయి ఎవరు కూడా కావాలనే వైరస్ ని వ్యాప్తి చెయ్యరు కదా ?మనకు ఎవరి నుంచి వైరస్ వస్తుందనే విషయం మనకు ఎలా తెలుస్తుంది, నవ్య స్వామి కి కరోనా సోకిందని తెలియగానే నాపై పలు రూమర్స్ ప్రచారం చెయ్యడం బాధ పెట్టె విషయం. అంటూ నవ్య స్వామి తన భాధను వెళ్లబుచ్చారు.
https://www.instagram.com/tv/CCGjd7UDwh2/
End of Article