“వెబ్ సిరీస్” లలో నటించిన 17 టాలీవుడ్ హీరోయిన్స్…కొందరు హిట్టు కొందరు ఫట్టు.!!

“వెబ్ సిరీస్” లలో నటించిన 17 టాలీవుడ్ హీరోయిన్స్…కొందరు హిట్టు కొందరు ఫట్టు.!!

by Mohana Priya

Ads

సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో వెబ్ సిరీస్ కి కూడా అంతే డిమాండ్ పెరుగుతోంది. వెబ్ సిరీస్ కి సెన్సార్ ఉండదు. అందుకే అందులో కంటెంట్ కి ఎవరి భావాలను నొప్పించద్దు, లేదా ఎవరినీ కించపరిచే పదాలు వాడొద్దు లాంటి అవధులు ఏమీ ఉండవు.

Video Advertisement

వెండితెర మీద చూపించడానికి భయపడే ఎన్నో విషయాలను వెబ్ సిరీస్ ద్వారా జనాలకు చూపించాలని దర్శకులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల ప్రయత్నానికి ఫలితంగా ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ ను అంతే ఎక్కువగా ఆదరిస్తున్నారు. కొత్త దర్శకులే కాకుండా అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి లాంటి దర్శకులు కూడా అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ రెండూ మేనేజ్ చేస్తున్నారు.

వెబ్ సిరీస్ ఎంతో మంది కొత్త టాలెంట్ లకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి కూడా ఉపయోగపడుతోంది. పరిశ్రమలో చాలామంది నటులకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ సినిమాల్లో ఉండే పరిమితుల వల్ల వాళ్లు అనుకున్నంత బాగా ఆ పాత్రను ప్రదర్శించలేకపోవచ్చు.

దాంతో తమ లోని మరో కోణాన్ని బయటికి తేవడానికి ఆల్రెడీ పేరు సంపాదించుకున్న నటులు అందులో మరీ ముఖ్యంగా హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా సినీ పరిశ్రమలో తమ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టిన లేదా పెట్టబోతున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.

#1 రాధిక ఆప్టే – సేక్రెడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్ (హిందీ)


#2 ప్రియమణి – ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1


#3 మనిషా కొయిరాల – లస్ట్ స్టోరీస్ (హిందీ), మస్కా


#4 శోభితా ధూళిపాళ – మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ అఫ్ బ్లడ్, ఘోస్ట్ స్టోరీస్


#5 అమలా పాల్ – లస్ట్ స్టోరీస్ (తెలుగు)


#6 సమంత – ఫ్యామిలీ మాన్ సీజన్ 2


#7 రమ్యకృష్ణ – క్వీన్


#8 అమల అక్కినేని – హై ప్రీస్టెస్


#9 మంచు లక్ష్మి – మిస్సెస్ సుబ్బలక్ష్మి


#10 ఈషా రెబ్బ – లస్ట్ స్టోరీస్ (తెలుగు)


#11 శ్వేతా బసు ప్రసాద్ – గ్యాంగ్ స్టార్స్ (తెలుగు), ఫ్లిప్


#12 నిత్యా మీనన్ – బ్రీత్ సీజన్ 2


#13 ఆషా సైని – ఇన్సైడ్ ఎడ్జ్ 2, ఆర్య

#14 నేహ ధూపియా – లస్ట్ స్టోరీస్ (హిందీ)


#15 లారా దత్తా – హండ్రెడ్


#16సుష్మితా సేన్ – ఆర్య

#17 కియారా అద్వానీ – లస్ట్ స్టోరీస్ (హిందీ), గిల్టీ

వీళ్లే కాకుండా హెబ్బా పటేల్, చాందినీ చౌదరి, బిందు మాధవి, తేజస్వి, కల్పిక గణేష్, పావని గంగిరెడ్డి ఇంకా ఎంతో మంది తారలు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అంతే కాకుండా కాజల్, తమన్నా, హన్సిక లాంటి అగ్ర తారలు కూడా ఈ సంవత్సరం వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. హీరోయిన్లు మాత్రమే కాదు నవదీప్, అరుణ్ అదిత్, ప్రియదర్శి ఇంకా ఎంతో మంది హీరోలు కూడా వెబ్ సిరీస్ కి ప్రాధాన్యతనిస్తున్నారు.


End of Article

You may also like