Ads
వివాదాలకు కేంద్రబిందువైన ఆర్జీవి తాజాగా పవర్ స్టార్ అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ యూట్యూబ్ లో లీక్ అయ్యింది.దానితో ఆర్జీవి అఫీషియల్ గా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు.
Video Advertisement
ఆ ట్రైలర్ లో పవన్ ఫ్యాన్స్ కి మంట ఎక్కించే విషయాలు బోలెడు ఉన్నాయి.దీనితో ఆర్జీవి పై పవన్ ఫ్యాన్స్ ఒకపక్క మండి పడుతుంటే మరోపక్క సోషల్ మీడియాలో నేడు విడుదలైన పవర్ స్టార్ ట్రైలర్ చివర్లో వోడ్కా బాటిల్ పట్టుకొని నిలబడిన వ్యక్తి ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.
గతంలో రాంగోపాల్ వర్మ ఈ చిత్రంతో తొలిసారిగా తెర ముందు కనిపించబోతున్నారని చర్చ జరిగింది.కాని దీని పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.దానితో ఇది ఒట్టి గాసిప్ అని ప్రజలంతా లైట్ తీసుకొన్నారు. కాని తాజాగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ ట్రైలర్ చివర్లో వోడ్కా బాటిల్ తో వచ్చింది రాంగోపాల్ వర్మ నేమో అంటూ జోకులు వేసుకుంటున్నారు.
ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?అందులో ఉండేది రాంగోపాల్ వర్మ నే అయి ఉండవచ్చు కాకపోయి ఉండవచ్చు.ఈ చిత్రం విడులయ్యే వరకు ఈ అంశంపై క్లారిటీ వచ్చేలా లేదు.మరి ఈ చిత్రంలో వోడ్కా బాటిల్ పట్టుకున్న వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి
End of Article