హీరో చెల్లి పాత్రల్లో నటించిన ఒకప్పటి ఈ 9 మంది నటిలు గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

హీరో చెల్లి పాత్రల్లో నటించిన ఒకప్పటి ఈ 9 మంది నటిలు గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

by Mohana Priya

Ads

సినిమాల్లో హీరోయిన్ తర్వాత ముఖ్యమైన పాత్ర హీరో సోదరి పాత్ర. ఒక్కొక్కసారి హీరోయిన్ కంటే కూడా హీరో సోదరి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా సినిమాల్లో వాళ్ళ వల్లే కథ మలుపు తిరగడం, అప్పటివరకు ఒక లాగా ఉన్న హీరో సడన్ గా మారడం అవుతుంటాయి. హీరో సోదరి పాత్రల్లో నటించిన ఎంతోమంది ప్రస్తుతం ఇంకా నటిస్తున్నారు, మరికొంతమంది వేరే వృత్తుల్లో ఉన్నారు. అలా హీరో సోదరి పాత్రలో నటించిన కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం.

Video Advertisement

#1 సంధ్య – అన్నవరం

డబ్బింగ్ సినిమా ప్రేమిస్తే తెలుగు వాళ్లకి పరిచయమైన సంధ్య తర్వాత అన్నవరం సినిమాలో హీరో చెల్లెలిగా నటించారు. ఆ తర్వాత ఎన్నో తమిళం, మలయాళం సినిమాలు చేశారు. 2015లో చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖర్ ని వివాహం చేసుకున్నారు. వాళ్లకి ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. 2016 లో వచ్చిన మలయాళ సినిమా అవరుడే వీడు సినిమాలో కనిపించారు సంధ్య.

 

#2 మౌనిక – శివరామరాజు

శివరామరాజు లో ముగ్గురు అన్నల చెల్లి గా నటించిన మౌనిక తర్వాత మా అల్లుడు వెరీ గుడ్, కొడుకు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు. ఎన్నో సినిమాల్లో నటించిన మౌనిక తర్వాత 2014 లో ఇస్లాం మతం తీసుకున్నారు. తన పేరుని రహీమా గా మార్చుకున్నారు. 2015 లో చెన్నైకి చెందిన వ్యాపారి మాలిక్ ని వివాహం చేసుకున్నారు.

#3 మంజూష – రాఖీ

రాఖీ లో ఎన్టీఆర్ చెల్లెలిగా నటించిన మంజూష తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం యాంకరింగ్ కూడా చేస్తున్నారు.

#4 దీపా వెంకట్ – శ్రీరామ్

మనసిచ్చి చూడు, శ్రీరామ్ సినిమాల్లో, తర్వాత ఎన్నో తమిళ సీరియల్స్ లో కూడా నటించారు దీపా. దీపా నటి మాత్రమే కాకుండా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ప్రస్తుతం తమిళ్ లో టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ల లో ఒకరు దీపా. జ్యోతిక, సౌందర్య, సిమ్రాన్, గజాలా, సంజన, విద్యాబాలన్, శ్రీయ వంటి ఎంతో మంది హీరోయిన్లకు తమిళంలో డబ్బింగ్ చెప్పారు.

ఉరుమి సినిమాలో తమిళంలో పాటు తెలుగులో కూడా విద్యాబాలన్ కి దీపా డబ్బింగ్ చెప్పారు. నయనతార కి అయితే రాజా రాణి సినిమా నుండి దాదాపు ప్రతి సినిమాకి తమిళంలో దీపా నే చెబుతున్నారు. కాష్మోరా, వివేకం సినిమాల్లో తెలుగులో కూడా నయనతార కి డబ్బింగ్ చెప్పారు దీపా.

#5 శరణ్య మోహన్ – కళ్యాణ్ రామ్ కత్తి

మలయాళం సినిమా రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టారు శరణ్య. తెలుగులో విలేజ్ లో వినాయకుడు, భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ హ్యాపీగా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి సినిమా లో కళ్యాణ్ రామ్ చెల్లెలిగా నటించారు.

2015 లో ముద్ర అనే తెలుగు సినిమాలో నటించారు. అదే సంవత్సరంలో తనకి ఎంతోకాలం నుండి స్నేహితులు అయిన అరవింద్ కృష్ణన్ ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

#6 వర్ష – వాసు

వాసు సినిమా లో హీరో చెల్లెలిగా నటించారు. అంతేకాకుండా నువ్వే కావాలి ఇంకా చాలా సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించారు వర్ష. ఈటీవీ లో వచ్చిన కురుక్షేత్రం సీరియల్ లో హీరోయిన్ గా నటించారు. తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈటీవీ లో ఒక సీరియలో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు.

#7 మధుమిత – పుట్టింటికి రా చెల్లి

పుట్టింటికి రా చెల్లి సినిమా తో పాటు, మన్మధుడు, నువ్వే నువ్వే సినిమాల్లో నటించారు. స్వప్నమాధురి అనే పేరుతో యాంకరింగ్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. తర్వాత తన పేరుని మధుమిత గా మార్చుకున్నారు. నటులు, బిగ్ బాస్ వన్ విజేత అయిన శివబాలాజీ ని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరిస్తున్నారు.

#8 వాసుకి – తొలిప్రేమ

తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి మీకు గుర్తుండే ఉంటారు. అదే సినిమా కోసం తాజ్ మహల్ సెట్ క్రియేట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని పెళ్లి చేసుకున్నారు.

ఆనంద్ సాయి సైనికుడు, యమదొంగ, పులి, గుడుంబా శంకర్, నాని, బాలు, బృందావనం సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అంతేకాకుండా భువనగిరి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి కి కూడా చీఫ్ ఆర్కిటెక్ట్ గా బాధ్యతలు నిర్వహించారు. వాసుకి ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పి గూగుల్ లో పనిచేస్తున్నారు.

#9 కీర్తి రెడ్డి – అర్జున్

అర్జున్ సినిమాలో మహేష్ బాబు కవల సోదరి గా నటించిన కీర్తి రెడ్డి మనకు కొత్త ఏమీ కాదు. అంతకుముందు గన్ షాట్, తొలిప్రేమ సినిమాల తో ఎంతో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని యూ ఎస్ లో సెటిల్ అయ్యారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 


End of Article

You may also like