“లాహిరి లాహిరి లాహిరిలో” ఫేమ్ “ఆదిత్య” గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

“లాహిరి లాహిరి లాహిరిలో” ఫేమ్ “ఆదిత్య” గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

by Mohana Priya

Ads

లాహిరి లాహిరి లాహిరిలో సినిమా గుర్తుందా? అంత బ్లాక్ బస్టర్ సినిమా కచ్చితంగా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో నటించిన ఆదిత్య ఓం గుర్తున్నారా? లాహిరి లాహిరి లాహిరి లో సినిమా తో  తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన ఆదిత్య మంచి నటుడు మాత్రమే కాదు కథా రచయిత, పాటల రచయిత, డైరెక్టర్, నిర్మాత కూడా.

Video Advertisement

ఆ తర్వాత ఆదిత్య ఓం ఒట్టు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ధనలక్ష్మి ఐ లవ్ యు, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మా అన్నయ్య బంగారం, పున్నమినాగు వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించారు. మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ, శుద్ర, బందూక్, దోజఖ్ ఇన్ సెర్చ్ ఆఫ్ హెవెన్, అలిఫ్, మాసాబ్ వంటి హిందీ చిత్రాల్లో, సలాం హైదరాబాద్ అనే ఉర్దూ చిత్రంలో కూడా నటించారు.

పైన చెప్పిన చిత్రాల లో కొన్ని చిత్రాలకు ఆదిత్య దర్శకత్వం కూడా వహించారు. అందులో కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అవార్డు కూడా పొందాయి. 2013లో దామిని విల్లా అనే తెలుగు సినిమా చేశారు. ఆదిత్య ఓం తెలంగాణలోని చేరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ లైబ్రరీ కట్టించారు, అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న పాఠశాలలకు ఇంకా ప్రజలకి లాప్టాప్స్, ఇంకా సోలార్ లైట్ల ని కూడా అందజేశారు.

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ తెరమీద కనపడనున్నారు ఆదిత్య. బందీ అనే చిత్రంతో మళ్లీ మన ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ప్రకృతి అనే కాన్సెప్ట్ పై నడుస్తుందట. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఆదిత్య ఒక్కరే నటిస్తున్నారు. అంటే సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు . ఆదిత్య ఓం మాట్లాడుతూ తనని ఇంతవరకు ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని, ఇప్పుడు మళ్ళీ బందీ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు అని, ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది అని కోరుకుంటున్నారని తెలిపారు.


End of Article

You may also like