పెళ్లి రోజు ఈ జంట చేసిన పనికి ఫిదా అవ్వకుండా ఉండలేరు…అందరు ఇలాగే ఆలోచిస్తే ఎంతో బాగుండు.!

పెళ్లి రోజు ఈ జంట చేసిన పనికి ఫిదా అవ్వకుండా ఉండలేరు…అందరు ఇలాగే ఆలోచిస్తే ఎంతో బాగుండు.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మనిషి మరో మనిషి సహాయం కచ్చితంగా అవసరం. చాలామంది సెలబ్రిటీలతో పాటు మామూలు ప్రజలు కూడా ఆహారం రూపంలో, డబ్బు రూపంలో, నిత్యావసరాల రూపంలో ఇలా ఎన్నో రకాలుగా తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. అలాగే ఇటీవల లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న ఒక జంట ఒక క్వారంటైన్ సెంటర్ 50 బెడ్లు ఇచ్చారట. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Video Advertisement

మహారాష్ట్రకు చెందిన ఎరిన్ లోబో, మెర్లిన్ టస్కనో జూన్ 20వ తేదీన ఒక చర్చ్ లో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్దిసేపటి తర్వాత క్వారంటైన్ సెంటర్ కి వెళ్లి 50 బెడ్ లను, దిండ్లను, దుప్పట్లను ఇచ్చారు. దీన్ని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏ ఎన్ ఐ) వాళ్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో ఈ జంట చేసిన మంచి పనికి నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు.

ఇదొక్కటే కాకుండా లాక్ డౌన్ మొదలైన సమయం నుండి ఎరిన్ లోబో, మెర్లిన్ టస్కనో ఎంతో మంది ప్రజలకు సహాయం చేశారట. వేరే ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులకు ట్రైన్లు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేశారట.

తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకా ఆ జిల్లా యొక్క సబ్ డివిజన్ ఆఫీసర్ తో మాట్లాడి కోవిడ్ 19 సెంటర్లలో ఏమేమి కావాలో కనుక్కొని, వాళ్ల పెళ్లి కి అయ్యే ఖర్చు ను ఇలా ఉపయోగించారట. అలాగే ఆక్సిజన్ సిలిండర్ లను కూడా అందజేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు మెర్లిన్ టస్కనో తెలిపారు.


End of Article

You may also like