Ads
కొంతమంది నటులు చిన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. చిన్న వయసులో కూడా ఎంతో బాగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదిస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి సినిమాలకి స్వస్తి చెప్పి వేరే కెరీర్ ని ప్రారంభిస్తారు. దీనికి కారణం ఏమైనా అయ్యుండొచ్చు.
Video Advertisement
వాళ్లకి నటన అనేది కేవలం ఒక వ్యాపకం మాత్రమే అయి ఉండొచ్చు. లేదా వేరే ఫీల్డ్ పై ఆసక్తి కలిగి ఉండొచ్చు. ఇలా వాళ్లు నటనకు దూరం అవడానికి వేరు వేరు కారణాలు ఉండొచ్చు. అలా చిన్న వయసులో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటులలో మాస్టర్ అర్జున్ ఒకరు.
1987లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి సినిమా మనందరికీ తెలుసు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అతని పేరు అర్జున్. అర్జున్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి కొడుకు శిరీష్ గా నటించారు. ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాకుండా తాతినేని రామారావు దర్శకత్వం సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి నటించిన పచ్చని కాపురం సినిమాలో కూడా అర్జున్ నటించారు.
1984 లో వచ్చిన ఇల్లాలు ప్రియురాలు సినిమా లో కూడా అర్జున్ నటించారు. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అర్జున్. తర్వాత అబ్బబ్బ ఎంత హుడుగా అనే కన్నడ సినిమాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో హీరోగా చేశారట.
కానీ అవి అనుకున్నంత ప్రజాదరణ పొందలేదట. సినిమాలకు స్వస్తి చెప్పి అమెరికాలో డాక్టర్ గా సెటిలయ్యారట అర్జున్. అర్జున్ కి సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉందట. అలాగే అర్జున్ మంచి క్లాసికల్ డాన్సర్ అట.
స్నో వైట్ పేరుతో భారత దేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా 800కు పైగా క్లాసికల్ ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చారట అర్జున్. భవిష్యత్తులో అయినా అర్జున్ తిరిగి సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందేమో. వేచి చూద్దాం.
End of Article