హీరో రామ్ అక్కని చూసారా? శర్వానంద్ కి బంధువులని మీకు తెలుసా?

హీరో రామ్ అక్కని చూసారా? శర్వానంద్ కి బంధువులని మీకు తెలుసా?

by Mohana Priya

Ads

మామూలుగా సెలబ్రిటీలు అంటే అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అంటే దాదాపు వారికి సంబంధించిన ప్రతి విషయం అందరికీ తెలిసిపోతుంది.

Video Advertisement

కానీ కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటికి రానివ్వరు. వారిలో హీరో రామ్ ఒకరు. రామ్ ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ఏర్పరుచుకున్నారు.

రామ్ మన అందరికీ పరిచయమే. కానీ రామ్ వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఎక్కడా తన వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు.

ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ రామ్ కి బంధువు అవుతారు అనే ఒక విషయం తప్ప మిగిలిన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. రామ్ సోదరి పేరు మధు స్మిత. ఆమె ఒక ఆర్టిస్ట్ అట. 2012 లో మధు స్మిత తన ఆర్ట్స్ తో ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారట. మధు స్మిత ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారట.

హీరో శర్వానంద్ కూడా రామ్ కి బంధువు అవుతారు. రామ్ సోదరి మధు స్మిత శర్వానంద్ సోదరుడు కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నారట. అలా రామ్ ఇంకా శర్వానంద్ కూడా బంధువులు అవుతారు. శర్వానంద్ కూడా రామ్ లాగానే తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా ఎక్కువగా మాట్లాడరు.


End of Article

You may also like