Ads
ఎటువంటి ట్యాగ్ లేకుండా ముందు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తమకంటూ ఒక పేరు, గుర్తింపు సంపాదించుకొని స్టార్లు అవుతారు హీరోలు. అలా వాళ్ళకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం వచ్చిన తర్వాత సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కానీ, అది వాళ్ళ స్థానంపై ప్రభావం చూపదు అని అనుకునే అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత వాళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ లో కూడా ఖచ్చితంగా మార్పులు వస్తాయి. సాక్షి కథనం ప్రకారం అలా ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం.
Video Advertisement
#1 ప్రభాస్
లాక్ డౌన్ సమయంలో తన రాబోయే సినిమాలను ప్రకటించారు ప్రభాస్. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వం లో వస్తున్న ఆది పురుష్ అయితే, మరొకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఈ సినిమాకి ప్రభాస్ 100 కోట్లు తీసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
#2 మహేష్ బాబు
ఈ ఏడాది మొదట్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో విజయం సాధించారు మహేష్ బాబు. ఇప్పుడు 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
#3 పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు సందర్భంగా భవిష్యత్తులో తను చేయబోయే సినిమాలను అనౌన్స్ చేశారు. అలాగే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
#4 అల్లు అర్జున్
జనవరిలో వచ్చిన అల వైకుంఠపురం లో సినిమాతో విజయం సాధించిన అల్లు అర్జున్ తర్వాత రాబోయే చిత్రం పుష్ప అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
#5 జూనియర్ ఎన్టీఆర్
2018 లో వచ్చి సూపర్ హిట్ అయిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకి 33 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
#6 రామ్ చరణ్
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి 33 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు అనే వార్త వినిపిస్తోంది.
End of Article