Ads
ప్రముఖ సినీ నటులు జయ ప్రకాశ్ రెడ్డి గుంటూరులో ఉన్న తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. జయప్రకాష్ రెడ్డి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు, సహాయ పాత్రలు, కామెడీ పాత్రలు కూడా చేశారు. 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాల్లో నటించారు జయ ప్రకాష్ రెడ్డి.తర్వాత శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబ, ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, విక్రమార్కుడు, కింగ్, గబ్బర్ సింగ్, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. జనవరిలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయ ప్రకాష్ రెడ్డి చివరిగా మనకి తెరపై కనిపించారు.జయ ప్రకాష్ రెడ్డి గారు చివరి సారిగా మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి.
Video Advertisement
End of Article