ఒకప్పటి టాప్ యాంకర్ “అనిత చౌదరి” గురించి ఈ విషయాలు తెలుసా? ఫామిలీ ఫొటోస్ చూడండి!

ఒకప్పటి టాప్ యాంకర్ “అనిత చౌదరి” గురించి ఈ విషయాలు తెలుసా? ఫామిలీ ఫొటోస్ చూడండి!

by Mohana Priya

Ads

తెలుగు ఇండస్ట్రీలో అటు సినిమాల్లోనూ, ఇటు సీరియల్స్ లోనూ నటిస్తూనే యాంకరింగ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో అనితా చౌదరి ఒకరు. చిన్న వయసులోనే యాంకరింగ్ తో తన కెరీర్ మొదలు పెట్టారు అనితా చౌదరి.

Video Advertisement

అనిత చౌదరి తన ఇంట్లో తెలియకుండా డాన్స్ నేర్చుకునే వారట. డాన్స్ స్కూల్ లో ఉన్నప్పుడు అనితా చౌదరి కి ఒక టెలీఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చిందట. కానీ అది ప్రసారం అవ్వలేదట.

అనిత చౌదరి కి తెలియకుండా తన స్నేహితులు తన ఫోటోలని ఈటీవీ లో యాంకరింగ్ ఆడిషన్స్ కి పంపించారట. అలా ఈటీవీ లో యాంకర్ గా ఎంపికయ్యారు అనితా చౌదరి. ఆ కార్యక్రమంలో అనితా చౌదరి బ్రహ్మానందం గారితో కలిసి యాంకరింగ్ చేశారట. ఆ తర్వాత ఎన్నో షోస్ కి యాంకర్ గా చేశారు.

తర్వాత టీవీ సీరియల్స్ లో కూడా నటించడం మొదలు పెట్టారు అనితా చౌదరి. కస్తూరి, ఋతురాగాలు,అమృతం సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్ లో మాత్రమే కాకుండా సంతోషం, రారండోయ్ వేడుక చూద్దాం, నువ్వే నువ్వే, గురు, మన్మధుడు తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.

 

ఇప్పుడు అనిత చౌదరి విదేశాల్లో స్థిరపడ్డారు.  ప్రస్తుతం అనిత ఈటీవీ అభిరుచి ఛానల్ లో ఒక ప్రోగ్రాం లో విదేశాల్లో సెటిలైన తెలుగు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు.

 


End of Article

You may also like