Ads
తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. మౌన రాగం, మనసు మమత సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో నివాసముంటున్నారామె.రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. .. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయమయ్యారు. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను.ఆ పరిచయం స్నేహంగా మారింది. అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడు. శ్రావణి తను చనిపోయే ముందు దేవరాజ్ తనని వేధిస్తున్నట్లు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే అతని వేధింపులు ఆగకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.అయితే ఇప్పుడురోజుకో మలుపు తిరుగుతున్న నటి శ్రావణి కేసు. మరో కొత్త వీడియో బయటకి వచ్చింది .
Video Advertisement
End of Article