Ads
ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా ఫిదా సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి మూడేళ్లయింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.
Video Advertisement
అసలు విషయానికొస్తే, సినిమాలో ముందు భానుమతి వరుణ్ ని ఇష్టపడుతుంది. వరుణ్ కూడా భానుమతి ని ఇష్టపడతాడు. తర్వాత ఒక మిస్ అండర్స్టాండింగ్ వల్ల భానుమతి వరుణ్ పై కోపం పెంచుకుంటుంది.
వరుణ్ అమెరికా వెళ్లే ముందు కూడా భానుమతి తో మాట్లాడాలి అని ప్రయత్నిస్తాడు. కానీ భానుమతి సరిగ్గా స్పందించదు. ఫ్లైట్ ఎక్కినప్పుడు వరుణ్ భానుమతి కి తనని మిస్ అవుతున్నట్లు మెసేజ్ పెడతాడు.
ఇందులో పొరపాటు ఏముంది? అంతా బానే ఉంది కదా? అని అనుకోకండి. ఒకసారి మళ్ళీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. వరుణ్ భానుమతి కి పంపించేది ఎస్ ఎం ఎస్ అంటే టెక్స్ట్ మెసేజ్. కానీ భానుమతి ఆ మెసేజ్ ని వాట్సాప్ లో చదువుతుంది. కావాలంటే ఈ సారి మీరు కూడా మళ్లీ సినిమా చూసినప్పుడు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి.
ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా కొన్ని పొరపాట్లు కూడా కనిపిస్తాయి. అంటే ఉదాహరణకి వచ్చిండే పాట లో భానుమతి చేతికి గోరింటాకు ఉంటుంది, ఆ పాట తర్వాత వరుణ్ భానుమతి కి ఎగ్జామ్ ప్రిపరేషన్ కి సహాయం చేస్తున్నప్పుడు వచ్చే సీన్ లో కూడా భానుమతి చేతికి పండిన గోరింటాకు కనిపిస్తుంది. కానీ మరుసటి రోజు అంటే భానుమతి ఎగ్జామ్ రాయడానికి వెళ్లే రోజు, అదే రోజు వాళ్ళ అక్కని పెళ్లి కూతురిని చేస్తూ ఉంటారు. ఆ రోజు మాత్రం చేతులు మామూలుగా ఉంటాయి.
మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు. వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ఇంకొకటి సినిమాటిక్ లిబర్టీ. దీనికి రెండు ఉదాహరణలు తీసుకుందాం.
End of Article