“అమ్మోరు” సినిమా ఎన్నో సార్లు చూసే ఉంటారు…కానీ ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.?

“అమ్మోరు” సినిమా ఎన్నో సార్లు చూసే ఉంటారు…కానీ ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.?

by Mohana Priya

Ads

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.

Video Advertisement

అలా అమ్మోరు సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి దాదాపు 25 ఏళ్లు అయింది. కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

అసలు విషయానికొస్తే అమ్మోరు సినిమా లో సౌందర్య కి మెడకి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటుంది. దాదాపు సినిమా మొత్తం పుట్టుమచ్చ ఎడమ వైపు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో సినిమా చివరిలో పుట్టుమచ్చ కుడి వైపుకి ఉంటుంది. ఒకవేళ కుడివైపుకి కూడా పుట్టుమచ్చ ఉంటుందేమో అనుకుంటే ఒక్కసారి ఈ ఫోటోలను గమనించండి.

మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు. వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.

అమ్మోరు సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా గా నిలిచింది అమ్మోరు. దీన్నిబట్టి ఆడియన్స్ కూడా ఇలాంటి పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు అని, వీటివల్ల నిజంగా సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు అని వదిలేస్తారు అని, ముఖ్య ప్రాధాన్యత కథకి మాత్రమే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా కొంతకాలం తర్వాత సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా?” అనిపిస్తుంది అంతే.


End of Article

You may also like