ఈ “ఛత్రపతి” నటుడి భార్య సీరియల్ నటి అని మీకు తెలుసా.? ప్రేమించి పెళ్లి చేసుకొని ఎందుకు విడిపోయారు.?

ఈ “ఛత్రపతి” నటుడి భార్య సీరియల్ నటి అని మీకు తెలుసా.? ప్రేమించి పెళ్లి చేసుకొని ఎందుకు విడిపోయారు.?

by Mohana Priya

Ads

ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు చంద్రశేఖర్. 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో నటుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టారు చంద్రశేఖర్.

Video Advertisement

తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, అశోక్, విక్రమార్కుడు, ఢీ, రక్ష, మగధీర, మర్యాదరామన్న, శక్తి, లెజెండ్, ఆగడు, కార్తికేయ, కిక్ 2, జై సింహ, కృష్ణార్జున యుద్ధం, ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. తమిళ్ లో కూడా అజిత్ హీరోగా నటించిన విశ్వాసం సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు శేఖర్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

శేఖర్ భార్య కూడా నటులే. తన పేరు నీలియ భవాని. నీలియ భవాని పండగ చేస్కో, సైరా నరసింహారెడ్డి, శంకర, రన్ రాజా రన్, ఇంకా ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు. అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తారు నీలియ భవాని. శేఖర్ ఇంకా భవాని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయారట.

వారిద్దరికీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. 2019లో శేఖర్, రాట్నం మీడియా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయి ఫిజియోథెరపీ చేస్తున్నట్టు, అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు చెప్పారు.

watch video:

 

 


End of Article

You may also like