“భరత్ అనే నేను” లో ఈ సీన్ గమనించారా.? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో.?

“భరత్ అనే నేను” లో ఈ సీన్ గమనించారా.? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో.?

by Mohana Priya

Ads

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.

Video Advertisement

అలా భరత్ అనే నేను సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి రెండేళ్లయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

సినిమా మొదలయ్యే ముందు స్టార్టింగ్ లో ఈ సినిమా 2014 సంవత్సరానికి ముందు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు అని వేస్తారు. పైన ఉన్న షాట్ భరత్ అనే నేను సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఒక నోట్.

పైన ఉన్న సీన్ “ఇది కలలా ఉన్నదే” పాట లోది. ఇందులో భరత్, వసుమతి సినిమా చూడడానికి వెళ్తారు. మనకు చూపించిన దాని ప్రకారం వాళ్లు చూసే పాట టైగర్ జిందా హై సినిమాలోది. అంటే వాళ్లు టైగర్ జిందా హై సినిమా చూస్తున్నారు. కానీ టైగర్ జిందా హై వచ్చింది 2017 లో.

ఏదేమైనా దీనివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరగడం అనేది సహజం. అయినా ఇది పరిగణలోకి తీసుకునే అంత పెద్ద పొరపాటు ఏమీ కాదు. సినిమా చూసినప్పుడు “అదేంటి? ఇది పొరపాటు ఏమో కదా?” అని అనిపిస్తుంది అంతే.


End of Article

You may also like