దిల్ రాజు నుండి సునీత వరకు…ఈ ఏడాది రెండో పెళ్ళికి రెడీ అయిన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో చూడండి.!

దిల్ రాజు నుండి సునీత వరకు…ఈ ఏడాది రెండో పెళ్ళికి రెడీ అయిన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో చూడండి.!

by Mohana Priya

Ads

సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. అయినా సరే వాళ్ళ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. అందులో పెళ్లి కూడా ఒకటి.

Video Advertisement

పర్సనల్ కారణాల వల్ల కొంత మంది మ్యారేజ్ లైఫ్ అనుకున్న విధంగా సాగలేదు. దాంతో సపరేట్ అయ్యారు. 2020 లో కొంత మంది సెలబ్రిటీలు కొత్త జీవితం ప్రారంభించారు, మరికొంతమంది ప్రారంభించబోతున్నారు. వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు గారి భార్య, అనిత గారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 2020 మే నెలలో తేజస్వినిని పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు గారు.

#2 సామ్రాట్

ఎన్నో సినిమాల్లో నటించి అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా మన అందరికీ ఇంకా సుపరిచితులైన సామ్రాట్ కి కొంతకాలం క్రితం హర్షితతో వివాహం జరిగింది. 2018 లో వీళ్ళిద్దరూ విడిపోయారు. 2020 నవంబర్ లో సామ్రాట్ కి లిఖితతో వివాహం జరిగింది.

#3 సునీత

సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో కాలం నుండి మన అందర్నీ అలరిస్తున్న సునీతకి కిరణ్ కుమార్ తో వివాహం జరిగింది. తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇటీవల తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్న  విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు సునీత. కొద్ది రోజుల క్రితం రామకృష్ణ వీరపనేనితో సునీత నిశ్చితార్థం జరిగింది.

#4 ప్రభుదేవా

ప్రభుదేవాకి, 1995 లో రామ్‌లత్ తో వివాహం జరిగింది. తర్వాత 2011 లో వీరిద్దరూ విడిపోయారు. 2020 లో ప్రభుదేవా, హిమాని అనే ఒక ఫిజియోథెరపిస్ట్ ని పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కానీ, వివరాలు కానీ బయటికి రాలేదు. ప్రభుదేవా కూడా దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ప్రభుదేవా సోదరుడు రాజుసుందరం ఇటీవల ఈ టైమ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

 


End of Article

You may also like