Ads
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఉండటం సహజం. కొంతమంది తెలిసి పాటిస్తే, కొంతమంది తెలియకుండా కో ఇన్సిడెంటల్ గా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టినప్పుడు ఫలితం వేరే లాగా వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ విషయంలో కూడా దగ్గర దగ్గర ఇలాగే జరిగింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.
Video Advertisement
తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయజానకినాయక సినిమాలో నటించారు బెల్లంకొండ శ్రీనివాస్. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత సాక్ష్యం సినిమాలో నటించారు. ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన కవచం సినిమాలో కాజల్ అగర్వాల్ తో కలిసి నటించారు బెల్లంకొండ శ్రీనివాస్. తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమాలో నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెండు సినిమాలకి కూడా అనుకున్న రెస్పాన్స్ లభించలేదు. తర్వాత తమిళ్ లో సూపర్ హిట్ అయిన రట్ససన్ (రాట్చసన్) సినిమా రీమేక్ అయిన రాక్షసుడుతో మన ముందుకు వచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.
ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి హిట్ సినిమా ఇదే. ఒకసారి మనం బెల్లంకొండ శ్రీనివాస్ ఫిల్మోగ్రఫీ గమనిస్తే, అల్లుడు శీనులో చేసిన సమంత, కవచం, సీత సినిమాల్లో నటించిన కాజల్, సాక్ష్యం సినిమాలో నటించిన పూజా హెగ్డే, స్పీడున్నోడు సినిమాలో నటించిన సోనారిక, జయ జానకి నాయక సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్, బెల్లంకొండ శ్రీనివాస్ కంటే వయసులో పెద్దవాళ్ళు,
కవచం సినిమాలో ఇంకొక హీరోయిన్ గా మెహరీన్ ఉన్నాకూడా తను ఒక ముఖ్య పాత్రలో కనిపించారు మాత్రమే కానీ బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేయలేదు. ఇప్పటివరకూ చేసిన సినిమాల రూల్స్ ని బ్రేక్ చేసి రాక్షసుడు సినిమాలో తనకంటే చిన్నదైన అనుపమ పరమేశ్వరన్ తో నటించారు శ్రీనివాస్.
ఈ సినిమా రిజల్ట్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. అన్ని సినిమాలకి ఉన్న ఏజ్ అనే ఈ కామన్ పాయింట్ రాక్షసుడు సినిమాకి మాత్రం మారింది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో సారా అలీ ఖాన్ కానీ అనన్య పాండే కానీ హీరోయిన్ గా నటిస్తారు అనే వార్త ప్రచారం అవుతోంది.
#1. Alludu seenu
Bellamkonda srinivas – 28years
samantha – 33 years
tamanna – 31 years
#2. Speedunnodu
Bellamkonda srinivas – 28 years
Sonarika bhadoria – 29 years
#3. Jaya Janaki naayaka
Bellamkonda srinivas – 28 years
Rakul Preet singh – 30 years
#4. Kavacham
Bellamkonda srinivas – 28 years
Kajal agarwal – 35 years
Mehreen – 25 years
#5. Saakshyam
Bellamkonda srinivas – 28 years
Pooja hegde – 30 years
#6. Sita
Bellamkonda srinivas – 28 years
Kajal agarwal – 35 years
#7. Rakshasudu
Bellamkonda srinivas – 28 years
Anupama Parameshwaran – 24 years
#8. Alludu Adhurs
Bellamkonda srinivas – 28 years
Nabha natesh – 25 years
anu emannuel – 23 years
End of Article