Ads
కొన్ని సినిమాలు టీవీలో ఎన్నిసార్లు చేసినా కూడా అంతే ఇష్టంగా చూస్తాం. అందులో మల్లీశ్వరి సినిమా ఒకటి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్. మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ అన్నయ్య నరేష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. తన పేరు గ్రీష్మ నేత్రిక. గ్రీష్మ నేత్రిక అమ్ములు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Video Advertisement
ఆ తర్వాత మల్లీశ్వరి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరావచ్చుతో పాటు దాదాపు 30 కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. నేత్రిక సోదరి పేరు శ్రావ్య. శ్రావ్య కూడా నటే. లవ్ యూ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించారు శ్రావ్య. నేత్రిక గత సంవత్సరం విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో బసవతారకం గారి టీనేజ్ పాత్ర పోషించింది.
హీరోయిన్ గా అడుగు పెడదాం అనుకుంటున్న నేత్రిక మొదట ఈ పాత్ర చేయాలా వద్దా అనే సందేహంలో ఉందట. కానీ తర్వాత ఈ పాత్ర ద్వారా తనకు ప్రేక్షకులకు చేరువ కావచ్చు అనే ఉద్దేశంతో చేయడానికి నిర్ణయించుకుంది. నేత్రిక ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయిన భీష్మ సినిమాలో ఒక పాటలో కనిపిస్తుంది నేత్రిక.
ఎన్టీఆర్ మహానాయకుడు సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “తను దిల్ రాజు బ్యానర్ లో హీరోయిన్ గా పరిచయం అవ్వాలి అనుకుంటున్నాను అని, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను అని, స్క్రిప్ట్స్ వింటున్నాను, నన్ను త్వరలోనే ఇంకొక సినిమాలో చూస్తారు” అని చెప్పింది.
watch video:
End of Article