Ads
ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.
Video Advertisement
అలా జులాయి సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి 8 సంవత్సరాలయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.
# ఈ సినిమాలో ఒక సీన్ లో సోనూసూద్ ఇలియానాని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతుంటే హీరో అడ్డుకుంటాడు. హీరో ఒక బిల్డింగ్ లో నుండి కారు పోనిచ్చి రోడ్ మీదకి తీసుకువస్తాడు. అప్పుడు కార్ టైర్ ఊడిపోతుంది.
# తర్వాత షాట్ లో కూడా టైర్ కింద పడే ఉంటుంది.
# కింద ఉన్న ఫోటో అదే సీన్ లో తర్వాత వచ్చే షాట్. ఇందులో సోనుసూద్ హీరో కార్ ని షూట్ చేస్తాడు. ఈ షాట్ లో మళ్ళీ కార్ టైర్ కార్ కే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ సీన్ అబ్సర్వ్ చేయండి. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి.
అయినా, ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో, ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. దాన్నిబట్టి ఆడియన్స్ కూడా ఇలాంటి పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు అని, వీటివల్ల నిజంగా సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు అని వదిలేస్తారు అని, ముఖ్య ప్రాధాన్యత కథకి మాత్రమే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా కొంతకాలం తర్వాత సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా?” అనిపిస్తుంది అంతే.
End of Article